telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

ఓ అమ్మాయి 300 మంది బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారంటే… సంజయ్ దత్ వ్యాఖ్యలపై హీరోయిన్ ఫైర్

Sanjay

బాలీవుడ్ స్టార్ నటుడు సంజయ్ దత్‌పై నటి దీపాన్నిత శర్మ ఫైర్ అయ్యారు. ఇటీవల సంజయ్ తాను నటించిన ‘పానిపట్’ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా కపిల్ శర్మ షోకి వెళ్లారు. ఆ షోలో కమెడియన్ కపిల్ శర్మ.. సంజయ్ దత్‌కు ఓ ప్రశ్న వేశారు. ‘మీ 300 మంది గర్ల్‌ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు?’ అని అడిగారు. ఇందుకు సంజయ్ స్పందిస్తూ.. ‘నాకు ఎంత మంది గర్ల్‌ఫ్రెండ్స్ ఉన్నారో ఇంకా లెక్కపెట్టలేదు. కృతి సనన్‌ను నా 308వ గర్ల్‌ఫ్రెండ్‌ చేసుకోవాలని అనుకుంటున్నా’ అని చమత్కరించారు. దాంతో కపిల్ శర్మతో పాటు అక్కడున్న ఆడియన్స్ కూడా పగలబడి నవ్వుకున్నారు. ఈ విషయంపై దీపాన్నిత శర్మ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదే మాట ఓ అమ్మాయి చెప్పి ఉంటే ఇలాగే నవ్వి ఊరుకునేవారా? అని ప్రశ్నించారు. ‘తన సినిమాను ప్రమోట్ చేసుకోవడానికి ఓ షోకి వెళ్లిన ఓ నటుడు.. తనకున్న 300 మంది గర్ల్‌ఫ్రెండ్స్ గురించి గొప్పగా చెప్పుకున్నాడు. అతని మాటలు విని కపిల్ శర్మతో పాటు ఆడియన్స్ కూడా పగలబడి నవ్వుకున్నారు. ఒకవేళ అదే షోలో ఓ అమ్మాయి ఈ మాట అంటే ఇలాగే సరదాగా నవ్వి ఊరుకునేవారా? దాన్ని కూడా జోక్‌గా తీసుకునేవారా? ఈ అసమానత్వమే అన్ని తప్పులకు కారణం’ అని ట్వీట్ చేశారు.

Related posts