telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ రాజకీయ

50 శాతం వీవీప్యాట్ల స్లిప్పులను లెక్కింపుపై .. వచ్చే వారమే విచారణ..

supreme court two children petition

సుప్రీం కోర్టు లోక్‌ సభ ఎన్నికల ఫలితాల్లో భాగంగా 50 శాతం వీవీప్యాట్ల స్లిప్పులను లెక్కించాలని 21 పార్టీలు వేసిన రివ్యూ పిటిషన్‌పై విచారణ జరిపేందుకు అంగీకారం తెలిపింది. ఈ అంశంపై త్వరగా విచారణ జరపాలని ప్రతిపక్షాల తరఫు న్యాయవాది అభిషేక్‌ మను సింఘ్వి సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి ముందు ప్రస్తావించారు. ఈ పిటిషన్‌ పై వచ్చే వారం విచారణ జరగనుంది.

దీనిపై విచారణ చేపట్టిన సుప్రీం కోర్టు ప్రతి నియోజక వర్గంలో ఐదు వీవీప్యాట్‌ స్లిప్పులను ఈవీఎంలతో సరిపోల్చాలని తీర్పు నిచ్చింది. వీవీప్యాట్లలో 50% స్లిప్పులు లెక్కించడం వల్ల సమయం, సిబ్బంది ఎక్కువ అవసరమవుతాయని దీని వల్ల ఫలితాలు ఆలస్యమయ్యే అవకాశం ఉందని కేంద్ర ఎన్నికల సంఘం సుప్రీం కోర్టు లో అఫిడవిట్‌ దాఖలు చేయడంతో ఈ నిర్ణయం తీసుకుంది. దీనితో ప్రతిపక్షాలకు ఊరట కలిగించేలా ఐదు వీవీప్యాట్‌లను లెక్కించాలని నిర్ణయించినప్పటికీ గతనెలలో ప్రతిపక్షాలు దీనిపై రివ్యూ పిటిషన్‌ వేశాయి.

Related posts