telugu navyamedia
క్రైమ్ వార్తలు ట్రెండింగ్ వార్తలు సామాజిక

గూఢచర్యం ఆరోపణలతో రాబందు అరెస్టు

Vulture

యెమెన్ లోని ప్రభుత్వ బలగాలకు ఓ విచిత్రమైన అనుభవం ఎదురైంది. గూఢచర్యం ఆరోపణలతో ఓ రాబందును అరెస్టు చేశాయి యెమెన్‌లోని ప్రభుత్వ దళాలు. అంతర్యుద్ధంతో సతమతమవుతోన్న యెమెన్‌లోని టేజ్ పట్టణాన్ని హుతీ తిరుగుబాటుదారులు కైవసం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. వీరిని అడ్డుకోవడానికి ప్రభుత్వ బలగాలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. ఈ పరిస్థితుల మధ్య బల్గేరియా నుంచి ఆహరం కోసం వెదుక్కుంటున్న నెల్సన్ అనే గ్రిఫన్ జాతికి చెందిన ఓ రాబందు ఆ పట్టణంలోకి ప్రవేశించింది. దీని రెక్కలో ఓ జీపీఎస్ ట్రాకర్ ఉండటంతో, దీన్ని తిరుగుబాటుదారులు గూఢచర్యం కోసం ఉపయోగిస్తున్నారేమోనని మిలటరీ దళాలు భావించాయి. వెంటనే దాన్ని బంధించి జైల్లో వేశాయి. అయితే ఆ జీపీఎస్ ట్రాకర్‌ను అమర్చింది ఫండ్ ఫర్ వైల్డ్ ఫానా అండ్ ఫ్లోరా సంస్థ అధికారులని తేలడంతో.. పన్నెండు రోజుల నిర్భందం అనంతరం ఆ రాబందును విడుదల చేసినట్లు అధికారులు తెలిపారు.

Related posts