telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ వార్తలు

కర్ణాటక ఉపఎన్నికల .. పోలింగ్ ప్రారంభం..

voting started in by-poll in karnataka

సార్వత్రిక ఎన్నికల అనంతరం ప్రభుత్వం ఏర్పాటుకు మొదట బీజేపీ విశ్వప్రయత్నం చేసింది కానీ జేడీఎస్ మరియు కాంగ్రెస్ కూటమి కలిసి సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి, కానీ ఆ ప్రభుత్వం ఎన్నో రోజులు నిలబడలేదు. బల పరీక్ష సమయానికి కొందరు కూటమి ఎమ్మెల్యే లు ఓటింగ్ కు హాజరు కాకపోవడం తో సస్పెన్షన్ కు గురి కావాల్సి వచ్చింది .ఆ సస్పెన్షన్ కు గురి అయిన వారి స్థానాల్లో మల్లి ఉప ఎన్నికలకు దారి తీశాయి. బెంగళూరు పరిధిలోని హొస్కొటే, యశ్వంత్ పురా, శివాజీ నగర, కృష్ణరాజ పుర, మహాలక్ష్మి లేఅవుట్ లతో పాటు గోకక్, అథణి, కగ్వాడ, విజయనగర, హిరేకరూరు, రాణి బెన్నూరు, యల్లాపుర, చిక్ బళ్లాపుర, హుణసూరు, కృష్ణరాజ పేటేలల్లో ఉప ఎన్నికల పోలింగ్ కొనసాగుతుంది. మొత్తం 4,185 పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేశారు. అత్యధికంగా యశ్వంత్ పురా అసెంబ్లీ నియోజకవర్గంలో 461, అత్యల్పంగా శివాజీ నగర పరిధిలో 193 పోలింగ్ స్టేషన్లను అందుబాటులోకి తీసుకొచ్చారు. బెంగళూరు సిటీ పరిధిలోనే ఉన్న మరో సెగ్మెంట్ రాజరాజేశ్వరి నగరతో పాటు మస్కిలల్లో ఉప ఎన్నికలను ఎప్పుడు నిర్వహిస్తారనేది ఇంకా తేలాల్సి ఉంది.

అథణి బీజేపీ అభ్యర్థి మహేష్ కుమటళ్లి తన కుటుంబ సభ్యులతో కలిసి అదే పోలింగ్ కేంద్రంలో ఓటు హక్కును వినియోగించుకున్నారు. ప్రస్తుతం కర్ణాటకలో అధికారంలో ఉన్న బీజేపీ తన ప్రభుత్వాన్ని కాపుడు కోవానికి కనీసం ఏడు స్థానాలను కైవసం చేసుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుతం బీజేపీకి 105 మంది సంఖ్య బలం ఉంది. కొత్త ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేసిన తరువాత.. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవసరమైన ఎమ్మెల్యే ల సంఖ్య 112కు చేరుతుంది. ఆ మ్యాజిక్ ఫిగర్ ను అందుకుంటేనే యడియూరప్ప ప్రభుత్వం నిలబడ కలుగుతుంది. అత్యధికక స్థానాలను కాంగ్రెస్-జేడీఎస్ కూటమి గెలుచుకోగలిగితేమల్లి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఆ కూటమికి దక్కుతుంది. కర్ణాటకలో బీజేపీ ప్రభుత్వ నిలబడుతుందా లేదా అనేది ఈ ఉప ఎన్నికలతో తేలనుంది.

Related posts