telugu navyamedia
news political Telangana VOTE

గ్రేటర్‌లో వేలాది ఓట్లు మాయం..అధికారుల పై ఆగ్రహం

Votes Missing in Greater Hyderabad

శుక్రవారం జరిగిన పోలింగ్ లో గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలోని ఆయా నియోజక వర్గాల్లో పెద్ద ఎత్తున ఓట్లు గల్లంతయ్యాయి. వేలాదిమంది తమ ఓట్లు ఓటరు జాబితాలో లేకపోవడంతో ఎన్నికల అధికారుల పై ఆగ్రహం వ్యక్తం చేశారు. సాధారణ ఓటర్లతో పాటు సెలబెట్రీల ఓట్లు కూడా గల్లంతయ్యాయి. దీంతో ఓటర్లు ఆవేదన వ్యక్తం చేశారు.

ప్రముఖ బ్యాడ్మింటన్‌ క్రీడాకారిణి గుత్తా జ్వాలా ఓటు గల్లంతైంది. ఆమెతో పాటు కుటుంబ సభ్యుల ఓట్లు గల్లంతయ్యారు. ఓటర్ల జాబితాలో తన పేరు లేకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓటు వేసేందుకు శుక్రవారం ఉదయం ఆమె పోలింగ్‌ కేంద్రానికి చేరుకున్నారు. అక్కడ జాబితాలో తన పేరు కన్పించకపోవడంతో ట్విటర్‌ వేదికగా అసహనాన్ని వెళ్లగక్కారు. ‘ఆన్‌లైన్‌లో చెక్‌ చేసినప్పుడు నా పేరు ఉంది. ఓటర్ల జాబితాలో పేరు కన్పించకపోవడం ఆశ్చర్యంగా ఉంది. ఇలా జాబితాలో ఓటర్ల పేర్లు లేనప్పుడు ఎన్నికలు ఎలా పారదర్శకంగా జరుగుతాయి’ అని ప్రశ్నించారు.

పాతబస్తీ నియోజకవర్గాల్లో పెద్దఎత్తున ఓట్లు గల్లంతయ్యాయి. అంబర్‌పేటలోని మన్సూరాబాద్‌, గోషామహాల్‌ నియోజకవర్గంలోని జాంబాగ్‌ డివిజన్‌, కూకట్‌పల్లి నియోజకవర్గం ఓల్డ్‌ బోయిన్‌పల్లి డివిజన్‌లోఓటర్ల జాబితాలో పేర్ల గల్లంతయ్యాయి. పలువురు ఓటర్లు పొలింగ్‌ కేంద్రాలకు చేరుకుని ఓటు లేదని అధికారులు తెలుపడతంతో ఆగ్రహంతో ఓటర్లు మండిపడ్డారు.

Related posts

టీడీపీ ఎమ్మెల్యే కిడారి హత్య కేసులో నలుగురి అరెస్ట్

vimala p

ఇంటర్ బోర్డు వద్ద రెండో రోజూ ఉద్రిక్తత.. భారీగా మోహరించిన పోలీసులు!

vimala p

మంత్రోచ్చారణల మధ్య మహా చండీయాగం!

ashok