telugu navyamedia
సినిమా వార్తలు

“ఓటర్” థీమ్ సాంగ్

voter movie teaser

ఎన్నికలను పురస్కరించుకొని, ఎన్నికల నేపథ్యంలో మంచు వార‌బ్బాయి విష్ణు ప్ర‌ధాన పాత్ర‌లో తెర‌కెక్కుతున్న చిత్రం “ఓట‌ర్‌”. జీఎస్ కార్తీక్ ద‌ర్శ‌క‌త్వంలో రామా రీల్స్ బ్యాన‌ర్‌పై జాన్ సుధీర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తెలుగు, త‌మిళంలో విడుద‌ల కానున్న ఈ చిత్రంలో విష్ణు స‌ర‌స‌న సుర‌భి క‌థానాయిక‌గా న‌టిస్తుంది. ఇటీవలే ఈ చిత్రం నుంచి విడుదలైన టీజర్ కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది. తాజాగా ఈ చిత్రం నుంచి “ఓటర్” థీమ్ సాంగ్ ను విడుదల చేశారు. ఈ పాటను మీరు కూడా వినండి.

ఈ పాటను సాయిచరణ్ భాస్కరుని ఆలాపించారు. ప్రముఖ లిరిసిస్ట్ రామజోగయ్య శాస్త్రి లిరిక్స్ అందించారు. తమన్ సంగీతం సారథ్యం వహిస్తున్న ఈ చిత్రంలో సంపత్ రాజ్, నాజర్, పోసాని కృష్ణ మురళీ, ప్రవీణ్, ప్రగతి, ఎల్.బి శ్రీరామ్, జయ ప్రకాష్, సుప్రీత్ తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రం త్వరలోనే విడుదల కానుంది.

Related posts