telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ

తప్పుల తడకలుగా.. ఓటరు జాబితా.. !

Voters Registration from tomorrow |

దేశంలో ఎన్నికల నగారా మోగటంతో ఓటర్ జాబితా ప్రధానాంశంగా మారింది. ఒక పక్క ఓట్ల గల్లంతు జరుగుతుంది అనేదానిపై ఆయా రాష్ట్రాల ఎన్నికల అధికారులు కసరత్తు చేస్తూనే మరోపక్క ఎప్పటికప్పుడు ఓటరు జాబితాలను సిద్ధం చేసుకుంటున్నారు. ఈ రెంటిమధ్య సమన్వయలోపం స్పష్టంగా కనిపిస్తుంది, ప్రాధమికంగా విడుదల చేస్తున్న ప్రతి జాబితాలో అనేక తప్పులు ఉండటంతో, ఓటరు కూడా ఒకపక్క ఓట్లగల్లంతు, మరోపక్క సరిలేని జాబితాలతో ఆందోళలన చెందుతున్నాడు.

ఎప్పటికప్పుడు ఓటర్ల జాబితాను సరిగా సిద్ధం చేసుకోవాల్సిన అవసరం ఉంది, కానీ ఎన్నికల సమయంలో తప్ప అటువంటి విషయాలు పట్టించుకోకపోవడంతో అధికారులకు ఇప్పుడు ఇక్కట్లు తప్పడంలేదు. సాధారణంగా ప్రతియేటా మృత్యువాత పడ్డ వారి ఓట్లు తొలగించాల్సి ఉంది. కానీ ఆ పనికూడా సరిగా జరగటంలేదు. దీనితో ఆయా పార్టీలు దీనిని అనుకూలంగా మార్చుకొని, దొంగ ఓట్లుగా మలచుకుంటున్నారు. ముందుగా దీనిని చెక్ పెట్టాలి. డేటా అంతా ఈసీ వద్ద భద్రంగా ఉందాలేదా అనేది కూడా చూసుకోవాల్సి ఉంది. అయితే కేంద్రంలో, రాష్ట్రాలలో ఉన్న ప్రభుత్వాలు ఈసీ ని తమ సొంత ఇంటిలా వాడుకోవటంతో, ఓట్ల గల్లంతు అనేది తెరపైకి వచ్చింది. దేశం మొత్తంలో ఒక పార్టీ అధికారంలో ఉంటె కూడా ఇలాంటి సమస్య తప్పదని మరో సారి కొత్త కోణం భారత రాజకీయాలలో వెలుగులోకి వచ్చింది.

ఇక ఏదో ఉన్న డేటా ప్రకారం, ఈసీ విడుదల చేస్తున్న జాబితా ఆయా ప్రభుత్వాలు చేస్తున్న రాజకీయ చదరంగం. ఓటింగ్ ప్రక్రియ వరకు ఇదే చెప్పి, అనంతరం తమకు అనుకూలంగా ఈ సందర్భాన్ని మార్చుకోవాలని భారత ప్రభుత్వం చూస్తుండటం విచారకరం. ఇంతోటి దేశానికి స్వాతంత్రం తెచ్చిపెట్టామని, నాటి స్వాతంత్ర సమరయోధులు కూడా ఛీ అనే స్థాయికి రాజకీయాలు చేరుకున్నాయి. ప్రభుత్వ యంత్రాంగాన్ని కూడా రాజకీయ బురద పులిమి, ప్రతి వ్యవస్థను నాశనం చేసి, ప్రపంచం ముందు దేశాన్ని పనికిమాలిన దేశంగా తీర్చిదిద్దుతున్నాయి. బహుశా, రాజకీయ నాయకులంతా, ప్రపంచ ఉగ్రవాద సంస్థల నుండి ఈ మేరకు కాంట్రాక్టు తీసుకున్నట్టే ప్రస్తుత పరిస్థితులను చూస్తుంటే అనిపిస్తుందని.. విశ్లేషకులు విమర్శిస్తున్నారు.

Related posts