telugu navyamedia
culture political trending

ఓట్ ఫర్ మోడీ .. అంటున్న పెళ్లి పత్రిక.. తెలంగాణ యువకుడి వింత ప్రచారం..

vote for modi campaign through wedding card

యువతకు ఒక వస్తువు లేదా ఒక వ్యక్తి పై అభిమానం ఏర్పడితే దానికి హద్దులే ఉండవు. వారు ఏ పనిచేసినా, అందులో తమ అభిమానాన్ని వ్యక్తపరుస్తూనే ఉంటారు. ఇక్కడ తెలంగాణకు చెందిన ఓ యువకుడు, ఇంకాస్త వినూత్నంగా ఆలోచించి, ప్రధాని నరేంద్ర మోదీపై తనకున్న అభిమానాన్ని చూపించాడు. ఈ నెల 21న పెళ్లి చేసుకోనున్న శంషాబాద్ కు చెందిన దంపతులు సుభాష్ రావ్ కిషన్ రావు, అంబికా బాయి దంపతుల కుమారుడు ముఖేష్ రావు కొత్తగా వివాహ పత్రిక రూపొందిచుకున్నాడు.

అందులో వివాహానికి వచ్చే అతిథులు ఎలాంటి బహుమతులూ తీసుకు రావద్దని, అందుకు బదులుగా వచ్చే లోక్ సభ ఎన్నికల్లో మోదీకి ఓటు వేయాలని, అదే తనకు పెద్ద బహుమతని వెడ్డింగ్ కార్డుపై ముద్రించాడు. ఆపై ‘ఓట్ ఫర్ మోదీ’ అంటూ కమలం గుర్తును సైతం ముద్రించగా, దీన్ని అందుకున్న వారు ఆశ్యర్యానికి లోనవుతున్నారు. మోదీ స్ఫూర్తితో తాను ప్రతి నెలా స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని చేపడుతున్నానని, ఆయనే మరోసారి ప్రధానిగా ఉండాలని కోరుకుంటున్నానని ఈ సందర్భంగా ముఖేష్ రావు వ్యాఖ్యానించారు.

Related posts

ఆధార్‌ కార్డు .. మార్పులుచేర్పులలో .. వెసులుబాటు..

vimala p

జనసేనకు .. ఝలక్ ఇస్తున్న.. వీరాభిమానులు.. !

vimala p

ఐపీఎల్ : హైదరాబాద్ అవకాశాన్ని .. లాగేసిన .. బెంగుళూరు..

vimala p