telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ వ్యాపార వార్తలు సాంకేతిక

వాతావరణ కాలుష్యం చేసుకోండి .. అయితే… : ఎన్.జి.టి

volkswagen to pay 100cr to ngt
వాతావరణ కాలుష్యం వద్దు అంటూనే మరోపక్క అలా చేసేవారివద్ద జరిమానా పేరుమీద నగదు వసూలు చేస్తున్నారు.. సదరు అధికారులు. అంటే కాలుష్యం ఇష్టానుసారంగా చేసుకోమని, అయితే దానికి తగిన నగదు చెల్లించాలని అంటున్నారా! ఇటీవల ఓ తీర్పు అదే చెపుతుంది.. జర్మనీకి చెందిన ప్రముఖ ఆటోమొబైల్‌ సంస్థ ఫోక్స్‌వ్యాగన్‌పై జాతీయ హరిత ట్రైబ్యునల్‌(ఎన్‌జీటీ) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఉద్గారాల కేసులో ట్రైబ్యునల్‌ ఆదేశించినా డబ్బు ఎందుకు జమ చేయలేదని ప్రశ్నించింది. 
ఈ కేసులో ఇంకా సమయం ఇచ్చేది లేదని.. 24 గంటల్లోగా రూ. 100కోట్లు జమ చేయాల్సిందేనని ఎన్‌జీటీ ఆదేశాలు జారీ చేసింది. అసలేం జరిగిందంటే..ఫోక్స్‌వ్యాగన్‌ డీజిల్‌ కార్లలో ఉపయోగించే ఓ పరికరం కారణంగా పర్యావరణానికి తీవ్ర హాని కలుగుతోందని సంస్థపై ఉద్గారాల కేసు నమోదైంది. దీనిపై విచారించిన ఎన్‌జీటీ గతేడాది నవంబరు 16న ఫోక్స్‌వ్యాగన్‌కు  జరిమానా విధించింది. కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి ఖాతాలో రూ. 100 కోట్ల జమ చేయాలని ఆదేశించింది. అయితే ఈ ఆదేశాలను పక్కనబెట్టిన సంస్థ ఇంతవరకూ ఆ డబ్బును జమ చేయలేదు. 
కాలుష్యం అవుతుందని తెలిసి అనుమతులు ఇవ్వడం దేనికి, తగిన నగదు ఇవ్వలేదని కోర్టుకు వెళ్లడం దేనికి. కాలుష్యం చేసే అభివృద్ధి నిజంగా ఆహ్వానించదగినదా, దానిని అభివృద్ధి అనవచ్చా..ఈవిషయాలపై ద్రుష్టి పెడితే సరైన దారులు అవే కనిపిస్తాయి. లేదంటే, ఏది కనిపిస్తే అదే అభివృద్ధి అనేయాల్సి ఉంటుంది. 

Related posts