telugu navyamedia
telugu cinema news

సంక్రాంతికి విజయ్ సినిమా ప్రారంభం

Vijay

విజయ్ హీరోగా మురుగదాస్ దర్శకత్వంలో తెరకెక్కిన “సర్కార్” సినిమా ఇటీవల విడుదలై ఎంతగా వివాదాస్పదమైందో… అంతే విజయాన్ని కూడా సాధించింది. ఈ సినిమాలో జయలలితను అవమానించేలా సన్నివేశాలు ఉన్నాయంటూ తమిళ రాజకీయ పార్టీలు సినిమా విడుదల కాకుండా అడ్డుకోవడానికి చాలానే ప్రయత్నాలు చేశారు. అయినా కూడా ఇళయదళపతి నటించిన “సర్కార్” సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద భారీ కలెక్షన్లను కొల్లగొడుతూ సరికొత్త రికార్డులను సృష్టించింది. ఇక ఇప్పుడు విజయ్ తన తదుపరి చిత్రంపై దృష్టి సారించారు.

విజయ్ తాజా చిత్రం దర్శకుడు అట్లీ దర్శకత్వంలో రూపొందబోతోంది. అట్లీ కుమార్ పూర్తి స్క్రిప్టును విజయ్ కు వినిపించాడట. పూర్తిగా కథ విన్న విజయ్ అందులో కొన్ని మార్పులు, చేర్పులు సూచించాడట. అట్లీ ఆ మార్పులు చేసి కథను సిద్ధం చేసే పనిలోనే ఉన్నాడట. ఈ సంక్రాంతికే సినిమాను విడుదల చేయాలనీ సన్నాహాలు చేసుకుంటున్నారు విజయ్. దీంతో ఈ సినిమా పూజా కార్యక్రమాలను సంక్రాంతి రోజు నిర్వహించనున్నారట. గతంలో విజయ్, అట్లీ కాంబినేషన్ లో వచ్చిన “తేరి, మెర్సల్” చిత్రాలు భారీ విజయాన్ని అందుకున్నాయి. దీంతో వీరిద్దరూ ఈసారి తమ చిత్రంతో ఖచ్చితంగా హ్యాట్రిక్ హిట్ కొట్టాలని చూస్తున్నారు.

Related posts

ఆకలి డొక్క..

vimala p

పవన్ ను మహేష్ తో పోల్చిన నాగబాబు

vimala p

స్మోకింగ్ చేస్తే ఈ వీడియోలో అదాశర్మలా అవుతారంట…!

vimala p