telugu navyamedia
ఆంధ్ర వార్తలు వార్తలు సామాజిక

పొగమంచు కారణంగా విశాఖలో విమానాలు రద్దు!

Airport vizag

విశాఖపట్టణంలో ఈ రోజు విమానాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. విమానాశ్రయంను ఈ రోజు ఉదయం పొగమంచు కమ్మేయడంతో విమానం ల్యాండింగ్ అయ్యే వీలు లేకపోవడంతో విశాఖలో దిగాల్సిన ఎయిర్ ఏషియా ఫ్లయిట్ ను భువనేశ్వర్ కు మళ్లించారు. విశాఖ నుంచి ఢిల్లీ, బెంగళూరు, హైదరాబాద్ ప్రాంతాలకు వెళ్లాల్సిన స్పైస్ జెట్, ఎయిర్ ఏషియా విమాన సర్వీసులను రద్దు చేస్తున్నట్టు అధికారులు వెల్లడించారు.

ఉదయం 11 గంటల తరువాత సర్వీసులను తిరిగి పునరుద్ధరించే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. పొగమంచు కారణంగా విమానాలు రద్దు కావడంతో, గమ్యస్థానాలకు చేరుకోవాల్సిన వందలాది మంది ప్రయాణికులు ఎయిర్ పోర్టులో ఇబ్బందులు పడుతున్నారు.

Related posts