telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

పథకం ప్రకారమే కేసీఆర్‌ టికెట్‌ నిరాకరించారు: వివేక్‌

Peddapally Ex MP Vivek not contest

ప్రభుత్వ సలహాదారు పదవితో పాటు టీఆర్‌ఎస్‌ పార్టీ సభ్యత్వానికి  మాజీ ఎంపీ  వివేక్‌ రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఒక పథకం ప్రకారమే తాను పోటీ చేసే అవకాశం లేకుండా కేసీఆర్‌ చివరి క్షణంలో పెద్దపల్లి లోక్‌ సభ టికెట్‌ నిరాకరించారని వివేక్‌ ఆరోపించారు. ఈ మేరకు టీఆర్‌ఎస్‌ అధినేత తెలంగాణ సీఎం కేసీఆర్‌కు వివేక్‌ బహిరంగ లేఖ రాశారు. సందర్భంగా ఆయన తీవ్రస్థాయిలో టీఆర్ఎస్‌ పార్టీ విమర్శలు గుప్పించారు. కేసీఆర్‌ ఆటబొమ్మలు కొందరు నా మీద తప్పుడు ఆరోపణలు ప్రచారం చేస్తున్నారు. పార్టీకి వ్యతిరేకంగా పోటీ చేసిన వ్యక్తికి టికెట్ ఇవ్వడాన్ని బట్టే ఎవరు ద్రోహం చేశారో తెలిపోయిందని లేఖలో తెలిపారు.

తెలంగాణ సాధనలో కాకా సేవలకు గుర్తింపుగానే ట్యాంక్ బండ్‌పై విగ్రహం పెట్టారు. టికెట్ హామీ ఇచ్చి కూడా నన్ను పెద్దపల్లికి దూరంగా ఉంచడానికే కేసీఆర్ తొత్తులు కొందరు పనిచేశారు. ప్రభుత్వ సలహాదారుగా ఎలాంటి ప్రయోజనాలు తీసుకోకపోగా, ఆ పదవి వల్లే హైదరాబాద్ క్రికెట్ సంఘం అధ్యక్షుడి పదవి పోగొట్టుకోవాల్సి వచ్చింది. నా ప్రజలకు నన్ను దూరం చేయడానికి చేసిన ఈ ద్రోహం నాకు దిగ్భ్రాంతి కలిగిస్తోంది. ఉద్యమంలో ఏ పాత్ర లేనివాళ్లకు టికెట్లిచ్చారని లేఖలో వివేక్ పేర్కొన్నారు.

Related posts