telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

వివేక్ నివాసానికి వెళ్లిన ఉత్తమ్.. కాంగ్రెస్ లోకి రావాలని ఆహ్వానం!

పెద్దపల్లి లోక్ సభ టీఆర్ఎస్ టికెట్ ఆశించి మనస్తాపానికి గురైన మాజీ ఎంపీ గడ్డం వివేక్ ను కాంగ్రెస్ పార్టీలోకి రావాల్సిందిగా తెలంగాణ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆహ్వానం పలికారు. ఈ సాయంత్రం వివేక్ నివాసానికి వెళ్లిన ఉత్తమ్ కుమార్ చర్చలు జరిపారు. ఉత్తమ్ కుమార్ ను సాదరంగా ఆహ్వానించిన వివేక్ ఆయన ప్రతిపాదన పట్ల ఎలాంటి నిర్ణయం వెల్లడించలేదని సమాచారం.

మరోవైపు వివేక్ బీజేపీలోకి వెళతారంటూ కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది. పెద్దపల్లి లోక్ సభ స్థానం నుంచి పోటీచేయాలని ఆశించిన ఆయనకు టీఆర్ఎస్ పార్టీ మొండిచేయి చూపింది. అప్పటినుంచి పార్టీకి దూరమైన వివేక్ తదుపరి మజిలీ బీజేపీయేనని ప్రచారం జరిగింది. దానికి తగ్గట్టుగానే రెండ్రోజుల కిందట వివేక్ కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది.

Related posts