telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

ప్రభుత్వ సలహాదారు పదవికి వివేక్‌ రాజీనామా

Peddapally Ex MP Vivek not contest

లోక్‌సభ ఎన్నికల్లో పలువురు సిట్టింగ్‌ ఎంపీలు, సీనియర్లకు టీఆర్‌ఎస్‌ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్‌ టికెట్‌ కేటాయించకపోవడంతో అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఖమ్మం, మహబూబాబాద్‌ సిట్టింగ్‌ ఎంపీలు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, అజ్మీర సీతారాంనాయక్‌ అలకబూనారు. ఈ నేపథ్యంలో పెద్దపల్లి మాజీ ఎంపీ జి.వివేక్‌ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు పదవికి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను శుక్రవారంరాత్రి సీఎం కేసీఆర్‌ కు ఆయన పంపారు.

2019 లోక్‌సభ ఎన్నికల్లో పెద్దపల్లి లోక్‌సభ టికెట్‌ ఇస్తానని చెప్పి టీఆర్‌ఎస్‌ పార్టీలోకి తీసుకున్నారని, కానీ తనకు టికెట్‌ నిరాకరించారని పేర్కొన్నారు. ఈ కారణంగానే ప్రభుత్వ సలహాదారు పదవికి రాజీనామా చేస్తున్నట్టు ఆ లేఖలో వెల్లడించారు. అయితే, టీఆర్‌ఎస్‌ ప్రాథమిక సభ్యత్వానికి మాత్రం రాజీనామా చేయలేదు. వివేక్‌ బీజేపీ అగ్రనేతలతో టచ్‌లో ఉన్నారని సమాచారం. తన తండ్రి వెంకటస్వామి చూపిన బాటలో పెద్దపల్లి ప్రాంత ప్రజలకు సేవ చేయడం తన కర్తవ్యమని తెలిపారు.

Related posts