telugu navyamedia
సినిమా వార్తలు

అక్కడైనా, ఇక్కడైనా వాళ్ళు భయపడిపోతున్నారు… వెండితెర మోడీ కామెంట్స్…

narendra-modi-and-vivek-oberoi

బాలీవుడ్ నటుడు, ప్రధాని మోదీ బయోపిక్‌లో నటించిన బాలీవుడ్ నటుడు వివేక్ ఓబెరాయ్ నిన్న జరిగిన భారత్-పాక్ మ్యాచ్‌ను తిలకించారు. అనంతరం తన స్పందనను సోషల్ మీడియాలో వెల్లడించారు. మ్యాచ్ ప్రారంభానికి ముందు వివేక్ తన ట్విట్టర్ హ్యాండిల్‌లో తాను నటించిన నరేంద్ర మోదీ సినిమాలోని ఒక సీన్ షేర్ చేస్తూ… “మైదానంలోనైనా, క్రికెట్‌లోనైనా మనతో తలపడేందుకు వారు భయపడిపోతున్నారు” అని కామెంట్ రాశారు. తరువాత వివేక్ క్రికెటర్ రోహిత్ శర్మ శతకం సాధించిన తరువాత ‘ఇది అద్భుతమైన సెంచరీ. అత్యద్భుతంగా ఆడుతున్నావ్ రోహిత్’ అని ట్వీట్ చేశారు.

Related posts