telugu navyamedia
సినిమా వార్తలు

రీల్ మోడీ, రియల్ మోడీ… ఇద్దరి పర్యటన ఒకే దగ్గర…!

narendra-modi-and-vivek-oberoi

‘పీఎం నరేంద్ర మోదీ’ సినిమాలో మోదీగా కనిపించిన బాలీవుడ్ నటుడు వివేక్ ఓబెరాయ్. లోక్‌సభ ఎన్నికల ఓట్ల లెక్కింపు జరిగిన మర్నాడు మే 24న ‘పీఎం నరేంద్ర మోదీ’ సినిమా విడుదలైంది. ఈ సినిమా బాక్సాఫీసు వద్ద మంచి వసూళ్లను రాబడుతోంది. అయితే వివేక్ ఇప్పుడు తన కుటుంబ సభ్యులతో సహా విహారయాత్రలకు మాల్దీవులకు బయలుదేరారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా తెలియజేశారు. మరోవైపు ప్రధాని నరేంద్ర మోదీ కూడా తన తొలి విదేశీ పర్యటనను మాల్దీవులలోనే చేస్తుంటడం విశేషం. అయితే వీరి పర్యటనలు వేర్వేరుగానే సాగనుంది. వివేక్ తన విదేశీ పర్యటనకు సంబంధించిన ఫోటోను తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో పోస్టు చేశారు. కాగా విదేశాంగశాఖ తెలిపిన వివరాల ప్రకారం ప్రధానిగా రెండవసారి బాధ్యతలు చేపట్టిన నరేంద్ర మోదీ జూన్ 8 మాల్దీవులలో, 9న శ్రీలంకలో పర్యటించనున్నారు.

Related posts