telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

బీజేపీ తీర్థం పుచ్చుకున్న మాజీ ఎంపీ వివేక్

Ex-MP-Gaddam-Vivek

తెలంగాణ మాజీ ఎంపీ గడ్డం వివేక్ ఈ రోజు బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా, తెలంగాణ బీజేపీ నేత కాశెట్టి లక్ష్మణ్ సమక్షంలో కాషాయ కండువా కప్పుకున్నారు. పెద్దపల్లి ఎంపీ స్థానం నుండి టీఆర్ఎస్ టిక్కెట్టు దక్కని కారణంగా ఆయన ఆ పార్టీకి దూరమయ్యాడు. కాంగ్రెస్ పార్టీ వివేక్ ను పార్టీలో చేరాలని ఆహ్వానించారు. కానీ వివేక్ అనూహ్యంగా బీజేపీలో చేరాడు. తెలంగాణాలో రాజకీయ అస్థిరత్వంతో పాటు నియంతృత్వ పోకడలు వినిపిస్తున్నాయన్నారు.

తెలంగాణలో అవినీతి రాజ్యమేలుతుందని, అభివృద్ధి అనేది కొందరి కుటుంబాలకి మాత్రమే పరిమితమైందన్నారు. ప్రజలకు మాత్రం ప్రభుత్వ పథకాలు నీటి మీద రాతలుగా మిగిలాయని విమర్శించారు. ప్రభుత్వం ప్రజలకు అనుకూలంగా పని చేయాలి కానీ, నిరంకుశంగా వారి గొంతులని అణగ తొక్కాలని చూస్తోందని దుయ్యబట్టారు. తెలంగాణ కోసం ప్రాణాలు సైతం వదిలిన అమరవీరుల కుటుంబాలను ప్రభుత్వం పక్కన పెట్టిందన్నారు. మాటల గారడితో ప్రజల మెప్పు పొందటం ప్రతీసారి సాధ్యం కాదన్నారు. బంగారు తెలంగాణ అనేది మాటలలో కాదు, చేతలలో చూపించాలని, ఇది కేవలం బీజేపీతో మాత్రమే సాధ్యమవుతుందని అని వివేక్ ఓ పోస్ట్ లో పేర్కొన్నారు.

Related posts