telugu navyamedia
సినిమా వార్తలు

బిగ్ బాస్-3 : వితికా ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి… వరుణ్ మందలింపు

quarrels between couple in bigg boss

బుల్లితెర బిగ్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజ‌న్ 3 ఆదివారం ఎపిసోడ్‌తో స‌క్సెస్‌ఫుల్‌గా 50 రోజులు (ఏడు వారాలు) పూర్తి చేసుకుంది. ఈ వారం శిల్ప చక్రవర్తి, పునర్నవి, మహేష్, హిమజ, శ్రీముఖి ల‌లో ఒక‌రు ఇంటి నుండి వెళ్ళ‌నున్నారు. ఎపిసోడ్ 52లో ఇంటి స‌భ్యుల‌కి ‘ఇంట్లో దెయ్యం నాకేం భయం’ అనే టాస్క్ ఇచ్చారు బిగ్ బాస్. టాస్క్ స‌క్ర‌మంగా పూర్తి చేయ‌ని కార‌ణంగా పున‌ర్న‌వి,శ్రీముఖి, మ‌హేష్‌ల‌కి బిగ్ బాస్ శిక్ష విధించిన సంగ‌తి తెలిసిందే . షూ పాలిష్ చేస్తేనే ల‌గ్జ‌రీ బ‌డ్జెట్ వ‌స్తుంద‌ని చెప్ప‌డంతో శ్రీముఖి పాలిష్ చేసేందుకు సిద్ధ‌మైంది. మ‌హేష్ ముందు కాస్త మొండికేసిన త‌ర్వాత పూర్తి చేశాడు. ఇక‌ 53వ రోజు కూడా ఇంటి స‌భ్యులు పున‌ర్న‌విని ఎంత స‌ముదాయించిన‌ప్ప‌టికి ఆమె చేయ‌న‌ని ఖ‌రాఖండీగా చెప్పేసింది. అయితే వ‌రుణ్ లాలించి, బుజ్జ‌గించి అన్ని విధాలు ట్రై చేసి చివ‌రికి ఆమెని టాస్క్‌లో పాల్గొనేలా చేశాడు. బిగ్ బాస్ ఇచ్చిన శిక్ష ఆ ముగ్గురు స‌క్సెస్ ఫుల్‌గా పూర్తి చేయ‌డంతో అంద‌రితో పాటు వీరికి కూడా ల‌గ్జ‌రీ బ‌డ్జెట్ వ‌స్తుంద‌ని బిగ్ బాస్ అన్నారు. ఇక ఎనిమిదో వారం ఇంటి కెప్టెన్ అయ్యేందుకు బిగ్ బాస్ ఓ టాస్క్ ఇచ్చారు. ‘బరువు లెత్తగలవా జెండా పాతగలవా’.. అనే టాస్క్ ఇచ్చారు. ఈ టాస్క్ ప్రకారం తమకు ఇష్టమైన వాళ్ల గుర్రం ఎక్కి ట్రాక్ లో ప‌రిగెత్తుతూ జెండాలు పాతాలి. ఎవరు ఎక్కువ జెండాలు పాతితే వాళ్లే హౌస్ కెప్టెన్ అవుతార‌ని బిగ్ బాస్ పేర్కొన్నారు

ఈ వారం కెప్టెన్ టాస్క్‌లో పాల్గొనేందుకు ఇంత వ‌ర‌కు కెప్టెన్ కాని వాళ్ళు పాల్గొనాల‌ని బిగ్ బాస్ తెలిపారు. దీంతో శ్రీముఖి, హిమ‌జ‌, మ‌హేష్ , వితికాలు కెప్టెన్ పోటీ బ‌రిలో నిలిచేందుకు సిద్ద‌మ‌య్యారు. ఎక్కువ ఓట్లు శ్రీముఖి, వితికా, మ‌హేష్‌ల‌కి ప‌డ‌డంతో ఈ ముగ్గ‌రు కెప్టెన్ టాస్క్‌లో పాల్గొన్నారు. మ‌హేష్‌.. శివ‌జ్యోతిని ఎత్తుకొని జెండాలు పాత‌గా, ర‌వికృష్ణ వీపుపై శ్రీముఖి ఎక్కి జెండాలు పాతింది. ఇక వితికా త‌న భ‌ర్త వ‌రుణ్ సందేశ్ వీపుపై ఎక్కి ఎక్కువ జెండాలు పాతింది. ఎక్కువ జెండాలు పాతిన క్ర‌మంలో బిగ్ బాస్ ఇంటి కెప్టెన్ అయ్యే అవ‌కాశాన్ని వితికా అందుకుంది. దీంతో ఆమె ఆనందానికి అవ‌ధులు లేకుండా పోయాయి. త‌న భ‌ర్త వ‌ల‌న క‌లిగిన విజ‌యాన్ని మ‌రింత‌గా ఆస్వాదిస్తూ తెగ ముద్దులు పెట్టేసింది. నా జీవితానికి ఇది చాలు.. నేను బిగ్ బాస్ సీజన్ 3లో కెప్టెన్ అయ్యానహో.. అంటూ దొరికిన వాళ్లకు దొరికినట్టుగా హగ్‌లు ఇచ్చేసింది . మిగ‌తా వాళ్ళ‌కి కెప్టెన్‌గా ఎలా ఉండాలో అంటూ స‌ల‌హాలు ఇవ్వ‌డం మొద‌లు పెట్టేసింది. దీనిపై వ‌రుణ్ మంద‌లించిన ఆమె త‌న ప‌ని తాను కానిచ్చేసింది . ఆ త‌ర్వాత బిగ్ బాస్ ఇంట్లో ఓ రిఫ్రిజిరేట‌ర్ ప్ర‌త్య‌క్షం కాగా, దానికి నాలుగు నెంబ‌ర్స్ ఇచ్చారు. ఇంటి స‌భ్యులు ట్రిక్ ఆర్ ట్రీట్ అని ఎంచుకొని త‌మకి న‌చ్చిన వాళ్ళ‌కి ఇది ఇవ్వొచ్చు అని తెలిపారు. ట్రీట్ అంటే 1 లేదా 2 నెంబ‌ర్స్‌లో ఉన్న ఫుడ్ ఐట‌మ్స్‌.. ట్రిక్ అంటే 3,4 ర్యాక్స్‌లో ఉన్న ఐక్ క్యూబ్స్ వారి త‌ల‌పై పోయ‌డం. ఈ గేమ్ అంద‌రు స‌ర‌దాగా ఆడ‌డంతో 54వ ఎపిసోడ్ ముగిసింది.

Related posts