vithanalu poetry corner

విత్తనాలు…

“మానవత్వాన్ని మొలకెత్తించే సహృదయ విత్తనాలు!
సౌభాతృత్వాన్ని ప్రసవించే
ఆత్మీయ అంకురాలు!
ఆర్ద్రతల్ని పూయించే
స్నేహ పరిమళ మొలకలు!
అనుబంధాన్ని కూల్చే
అనుమాన కల్తీ బీజాలు!
అగాధాలు సృష్టించే అహాల విత్తులు!
అన్యాయానికి వేళ్ళూనే 
అవినీతి పొత్తికలు!
విత్తేదైనా!
విచక్షణా మన్ను పోగేసుకోవాల్సింది మాత్రం “ఎద పుడమే!”
నైతిక సేంద్రీయతను
అందించాల్సింది “మెలకువ మస్తిష్క ప్రకృతే!”

 

-డి.నాగజ్యోతిశేఖర్,
మురమళ్ళ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *