telugu navyamedia
health trending

విటమిన్ బి3.. ఇదే బరువు పెరగాలన్నా.. తగ్గాలన్నా.. ! దాన్ని సరిగా ఉండేట్టు..

vitamin b3 contols fat issues

విట‌మిన్ బి3 మ‌న శ‌రీరానికి అవ‌స‌ర‌మ‌య్యే ఎన్నో ముఖ్య పోష‌కాల్లో కూడా ఒక‌టి. దీన్నే నియాసిన్ అని కూడా అంటారు. ఇది మ‌న శ‌రీరంలో కొలెస్ట్రాల్ స్థాయిల‌ను నియంత్రిస్తుంది. అలాగే ప‌లు ఇత‌ర ముఖ్య‌మైన ప‌నుల‌కు కూడా మ‌న‌కు విట‌మిన్ బి3 కావాలి. నిత్యం పురుషుల‌కు అయితే 16 మిల్లీగ్రాముల నియాసిన్ అవ‌స‌రం. అదే మ‌హిళ‌ల‌కు అయితే 14 మిల్లీగ్రాముల నియాసిన్ స‌రిపోతుంది. ఈ క్ర‌మంలోనే ప్ర‌తి ఒక్క‌రు నిత్యం విట‌మిన్ బి3 ఉన్న ఆహారాల‌ను తీసుకోవాలి.

* ఈ విట‌మిన్ మ‌న‌కు చికెన్ బ్రెస్ట్, కాలేయం, ఆకుకూర‌లు, గింజ‌లు, ట్యూనా ఫిష్‌, ప‌చ్చి బ‌ఠానీలు, మ‌ట‌న్ త‌దిత‌ర ఆహారాల్లో ల‌భిస్తుంది. ఈ ఆహారాల‌ను నిత్యం తీసుకుంటే విట‌మిన్ బి3 మ‌న‌కు స‌రిగ్గా అందుతుంది. త‌ద్వారా ఈ విట‌మిన్ లోపం రాకుండా చూసుకోవ‌చ్చు.

vitamin b3 contols fat issues* నియాసిన్ మ‌న జీర్ణ వ్య‌వ‌స్థ ప‌నితీరుకు కూడా ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డుతుంది. ఇది ఆక‌లిని పెంచుతుంది. చ‌ర్మాన్ని కాంతివంతంగా మారుస్తుంది. నాడీ వ్య‌వ‌స్థ‌ను స‌రిగ్గా పనిచేసేలా చేస్తుంది.

* శ‌రీరంలో చెడు కొలెస్ట్రాల్ ఉన్న‌వారు నిత్యం విట‌మిన్ బి3 ఉన్న ఆహారాల‌ను తీసుకుంటే కొలెస్ట్రాల్ తగ్గుతుంది.

* లైంగిక స‌మ‌స్య‌లు ఉన్న‌వారు కూడా ఈ విట‌మిన్ ఉన్న ఆహారాల‌ను తీసుకుంటే ఫ‌లితం ఉంటుంది.

* డ‌యాబెటిస్ ఉన్న‌వారు విట‌మిన్ బి3 ఉన్న ఆహారాల‌ను త‌ర‌చూ తీసుకుంటే షుగ‌ర్ స్థాయిలు నియంత్ర‌ణ‌లో ఉంటాయి.

Related posts

కియా తో .. ప్రభుత్వం ఎంఓయూ …

vimala p

జయరాం హత్యకేసులో… విచారణ ఎదుర్కొన్న నటుడు పింగ్ పాంగ్ సూర్య ..!

vimala p

దండుపాళ్యం చూసి.. హత్యలు, అత్యాచారాలు..ఒక్క జిల్లాలోనే 22 మంది.. !

vimala p