telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

ఆసక్తికరంగా “హిట్” ట్రైలర్

HIT

శైలేష్ కొలను దర్శకత్వంలో విశ్వక్‌సేన్, రుహానీ శర్మ జంటగా నటించిన సినిమా ‘హిట్’. ‘ది ఫస్ట్ కేస్’ అనే ట్యాగ్ లైన్‌తో ఈ చిత్రం తెరకెక్కింది. సస్పెన్స్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ నేడు విడుదలైంది. ప్రశాంతి తిపుర్నేని నిర్మాణ సారథ్యంలో ఈ చిత్రం తెరకెక్కింది. ఇటీవలే ఈ చిత్రం టీజర్ విడుదల కాగా… దానికి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది. ఈ చిత్రం ఫిబ్రవరి 28న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రంలో రుహానీ శర్మ రొమాంటిక్ సీన్స్‌‌తో అలరించింది. విడుదల తేదీ దగ్గరపడుతుండటంతో చిత్ర యూనిట్ ప్రచార కార్యక్రమాల జోరు పెంచింది. తాజాగా ఈ చిత్రం నుంచి ట్రైలర్ ను విడుదల చేశారు. ఈ ట్రైలర్ ఆసక్తిని రేకెత్తిస్తోంది. మీరు కూడా ట్రైలర్ ను వీక్షించండి.

Related posts