telugu navyamedia
వార్తలు సినిమా వార్తలు

విశ్వక్ సేన్ పాగల్ అప్డేట్…

మాస్ కా దాస్ విశ్వక్ సేన్ నటిస్తున్న తాజా చిత్రం పాగల్. ఈ సినిమా తమిళ హిట్ సినిమా ‘ఓ మై కడవులే’ రీమేక్‌గా తెరకెక్కతుంది. ఈ సినిమాకు తరున్ భాస్కర్ తెలుగు స్క్రీన్ ప్లే రాశారు. అయితే ‘ఈ నగరానికి ఏమైంది’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు విశ్వక్ నోటెడ్ అయ్యాడు. ఎప్పటికప్పుడు కొత్త కథలతో తెలుగు ప్రేక్షకులను అలరిస్తున్నాడు. అయితే ఈరోజు వాలెంటైన్స్ డే సందర్బంగా ‘పాగల్’ టీజర్ విడుదల తేదీని ప్రకటిస్తూ ఓ పోస్టర్ ను విడుదల చేశారు. ఫిబ్రవరి 18న పాగల్ టీజర్ రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించింది చిత్రబృందం. అయితే ఇప్పటికే అతడు చేస్తున్న పాగల్ సినిమా రిలీజ్ డేట్‌ను ప్రకటించారు. ఈ సినిమాతో మాస్ కా దాస్ ఏప్రిల్ 30న ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్దంగా ఉన్నారు. ఈ సినిమాను విశ్వక్ హీరోగా నరేష్ కుప్పిల్లి దర్శకత్వంలో బెక్కం వేణుగోపాల్ నిర్మిస్తున్నారు. ఈ సినిమా ఓ రొమాంటిక్ కథగా తెరకెక్కుతుంది. ఇందులో విశ్వక్ సేన్ తనలోని రొమాంటిక్ యాంగిల్ చూపించనున్నారు. ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. మరి మాస్ కా దాస్ వారి అంచనాలను ఏమాత్రం అందుకుంటారో వేచి చూడాలి.

Related posts