telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు సినిమా వార్తలు

మరోసారి వారిపై ఫైర్ అయిన విశ్వ‌క్ సేన్…

నందిత శ్వేత హీరోయిన్‌గా రూపొందుతున్న ‘అక్ష‌ర’ మూవీ ఇటీవ‌ల ప్రీ రిలీజ్ వేడుకని ఘ‌నంగా జ‌రుపుకుంది. ఈ కార్య‌క్ర‌మానికి విశ్వ‌క్ సేన్ ముఖ్య అతిథిగా హాజ‌ర‌య్యాడు. ఈ సంద‌ర్భంగా అక్ష‌ర‌.. విశ్వక్ ఈ వేడుకకు రావ‌డం ఆనందంగా ఉంద‌ని, ఆయ‌న‌కు ప్ర‌త్యేక కృత‌జ్ఞ‌త‌లు తెలియ‌జేస్తున్నాని పేర్కొంది. దీనిని యూట్యూబ్ ఛానెల్.. ‘విశ్వక్‌.. నీకు ఏం కావాలన్నా సిగ్గులేకుండా అడుగు ఇచ్చేస్తా’ అని థంబ్‌నెయిల్ పెట్టారు. ఇది విశ్వ‌క్ కంట ప‌డ‌డంతో ఓ వీడియో పోస్ట్ చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది.  విశ్వ‌క్ మాట్లాడుతూ.. ‘మీ ఇంట్లో ఆడ‌వాళ్లు ఉంటారు.  వాళ్ల గురించి వేరే వాడు త‌ప్పుగా మాట్లాడితే ఎలా ఉంటుంది. కొంచెం అయిన సిగ్గు అనిపించ‌డం లేదా.. ? అంటూ ఫైర్ అయ్యాడు. ‘నేను నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడుతున్నాను. రాసిన‌వాడు ఎవ‌డో కాని 24 గంట‌ల‌లో సారీ చెప్పుకుంటూ వీడియో పెట్ట‌క‌పోతే ఎక్క‌డున్నా నీ ద‌గ్గ‌ర‌కు వ‌చ్చి వీడియో పెట్టిస్తా’ అంటూ విశ్వక్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. షూటింగ్‌, ఇంకా ఏ ప‌నుల‌లో ఉన్నా పెట్టిస్తా అని యూ ట్యూబ్ ఛానెల్ కి వార్నింగ్ ఇచ్చాడు. విశ్వ‌క్ ప్రస్తుతం పాగల్ సినిమాతో బిజీగా ఉన్నాడు. చూడాలి మరి విశ్వక్ మాటల పై వారు ఏ విధంగా స్పందిస్తారు అనేది.

Related posts