telugu navyamedia
సినిమా వార్తలు

యాక్షన్​ కింగ్​ అర్జున్​- విశ్వక్​సేన్ సినిమా ప్రారంభం..

యాక్షన్‌ హీరో అర్జున్‌ సర్జా దర్శకత్వంలో యంగ్‌ హీరో విశ్వక్‌ సేన్‌, ఆయన కూతురు ఐశ్వర్య సర్జా హీరోహీరోయిన్లు ఓ సినిమా రాబోతుంది. ఈ రోజు చిత్ర ముహూర్తం మరియు పూజా కార్యక్రమాన్ని గ్రాండ్ గా నిర్వహించారు.

 యువ నటుడు విశ్వక్‌ సేన్‌ (Vishwak Sen) గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అక్కర లేదు. వరుస సినిమాల్లో నటిస్తూ అదరగొడుతున్నారు. అందులో భాగంగా ఆయన హీరోగా ఫ్యామిలీ ఎంటర్టైనర్‌‌ “అశోక వనంలో అర్జున కళ్యాణం” (Ashoka Vanamlo Arjuna Kalyanam) అనే సినిమా తాజాగా విడుదలైన సంగతి తెలిసిందే. విద్యా సాగర్ చింత దర్శకత్వం వహించిన ఈ సినిమా మంచి రెస్పాన్స్‌ను తెచ్చుకుంది. థియేటర్‌లో విడుదలైన ఈ సినిమా పాజిటివ్ టాక్‌ను తెచ్చుకుని అదరగొడుతోంది. ఇక ఈ సినిమా కలెక్షన్స్ విషయానికి వస్తే.. బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ సినిమా తెలుగు రాష్ట్రాలలో లిమిటెడ్‌గా రిలీజ్ అయ్యింది.. Photo : Twitter

ప్రొడక్షన్‌ నెం. 15న రాబోయే ఈ సినిమా నేడు హైదరాబాద్‌లో ప్రారంభమైంది.  రామానాయడు స్టూడియోలో ఈ సినిమా పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి నటుడు, రాజకీయ నాయకుడు పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా హజరై హీరోహీరోయిన్ల తొలి సీన్‌కు క్లాప్‌ కొట్టారు.

 దీంతో ప్రస్తుతం దీనికి సంబంధించిన పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక ఈ చిత్రంతో అర్జున్ కూతురు.. ఐశ్వర్య అర్జున్ టాలీవుడ్ అరంగేట్రం చేస్తున్నారు. ఈ సినిమాలో జగపతి బాబు ఓ కీలక పాత్రలో కనిపించనున్నారు. ఈరోజు ఈ సినిమా పూజా కార్యక్రమాలతో హైదరాబాద్‌లోని రామానాయుడు స్టూడియోస్‌లో గ్రాండ్‌గా ప్రారంభమైంది.  Photo : Twitter

.ఈ సందర్భంగా చిత్ర యూనిట్ తో మాట్లాడి, ఆల్ ద బెస్ట్ చెప్పారు. దీంతో ప్రస్తుతం దీనికి సంబంధించిన పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 

‘ఏమైందీ నగరానికీ’, ‘ఫలక్‌నూమాదాస్‌’ చిత్రాలతో టాలీవుడ్‌లోకి దూసుకొచ్చిన యంగ్‌ హీరో ప్రస్తుతం వరుస చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉన్నారు. ఇటీవలే ‘అశోకవనంలో అర్జున కల్యాణం’ సినిమాతో హిట్​ అందుకున్న హీరో విశ్వక్​సేన్​.. సూపర్​ ఛాన్స్​ను అందుకున్న సంగతి తెలిసిందే.

 విశ్వక్ సేన్, అర్జున్ తదితరులు పూజా కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సినిమాను శ్రీరామ్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి కెజీయఫ్ ఫేమ్ రవి బస్రూర్ సంగీతం అందించనున్నారు. డైలాగ్ రైటర్ సాయి మాధవ్ బుర్రా, కాస్ట్యూమ్ డిజైనర్ నీరజ కోన, లిరిసిస్ట్ చంద్రబోస్, సినిమాటోగ్రాఫర్ బాలమురుగన్ కూడా ఈ సినిమాలో భాగమయ్యారు. Photo : Twitter

కాగా ఈ చిత్రానికి అర్జున్‌ కథా రచయిత, దర్శకత్వంతో పాటు స్వయంగా నిర్మిస్తున్నాడు. ఈ చిత్రంతో అర్జున్ కూతురు.. ఐశ్వర్య అర్జున్ టాలీవుడ్ అరంగేట్రం చేస్తున్నారు. ఈ సినిమాలో జగపతి బాబు ఓ కీలక పాత్రలో కనిపించనున్నారు. ఈ చిత్రానికి కెజీయఫ్ ఫేమ్ రవి బస్రూర్ సంగీతం అందించనున్నారు. సాయి మాధవ్ బుర్రా డైలాగ్స్ అందిస్తారు.

'మా' అధ్యక్షుడు మంచు విష్ణు, సీనియర్​ నటుడు ప్రకాశ్​ రాజ్​ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని సందడి చేశారు.

ఈ కార్యక్రమంలో పవన్​కల్యాణ్​, ‘మా’ అధ్యక్షుడు మంచు విష్ణు, సీనియర్​ నటుడు ప్రకాశ్​ రాజ్​ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని సందడి చేశారు.

Related posts