telugu navyamedia
సినిమా వార్తలు

విడాకులకు కారణం ఏంటో చెప్పిన కోలీవుడ్ హీరో

Vishnu-Vishal

కోలీవుడ్‌ యువ కథానాయకుడు విష్ణు విశాల్‌ 2011లో నిర్మాత, నటుడు కె.నటరాజ్‌ కుమార్తె రజనీని వివాహం చేసుకున్నాడు. వీరికి ఆర్యన్‌ అనే కుమారుడు వున్నాడు. 6 ఏళ్ల వివాహ బంధంలో అభిప్రాయ భేదాలు రావడంతో గత ఏడాది నవంబరులో విడాకులు తీసుకున్నారు. ఈ విషయాన్ని కొన్ని నెలల తర్వాత విష్ణు బహిరంగంగా తెలియజేశాడు. అందుకు సంబంధించిన కారణాలను మాత్రం వెల్లడించలేదు. ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని విష్ణు విశాల్ బయటపేట్టారు.

“మొదటి నుంచి నేను ఎక్కువగా ఎవరితోనూ మాట్లాడేవాడిని కాను. సినిమాల్లో నటించడం వల్ల అది సమస్యగా మారింది. హీరోయిన్లతో లవ్‌ సన్నివేశాల్లో నటించేటప్పుడు కొంచెం సిగ్గుగా వుండేది. తరువాత ఈ విషయం తెలుసుకుని కో-ఆర్టిస్టులతో మాట్లాడడం ప్రారంభించాను. ఇదే మా ఇద్దరి మధ్య సమస్యగా మారింది. నువ్వు చాలా మారిపోయావు అంటూ గొడవలు ప్రారంభమయ్యాయి. విడాకుల వరకు వెళ్లింది. ఇప్పటికీ ఈ విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నాను. నా కొడుకు భవిష్యత్‌, నా భార్య మంచి కోసం ఈ నిర్ణయం తీసుకోవలసివచ్చింది. ఇప్పటికి తనంటే నాకు.. నేనంటే తనకు ఇష్టమే. అయితే మేము కలిసి వుండడం ప్రపంచానికి ఇష్టంలేదనుకుంటాను” అని అన్నారు విష్ణు విశాల్.

Related posts