telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

`తుప్పరివాలన్-2` వివాదం… దర్శకుడిగా విశాల్

తమిళ నటుడు విశాల్ కొత్త సినిమా `తుప్పరివాలన్-2` వివాదం ప్రస్తుతం కోలీవుడ్‌లో హాట్‌టాపిక్‌గా మారింది. `తుప్పరివాలన్-2` సినిమాకి అనుకున్న బడ్జెట్ కంటే రూ.5 కోట్లు ఎక్కువ అవసరమైందని, ఆ డబ్బును ఇవ్వడానికి హీరో, నిర్మాత విశాల్ నిరాకరించాడని, అందుకే మధ్యలోనే డైరెక్టర్ మిస్కిన్ సినిమా దర్శకత్వ బాధ్యతల నుంచి తప్పుకున్నట్లు మిస్కిన్ వెల్లడించారు. ఈ వివాదం గురించి తాజాగా విశాల్ ట్విటర్ ద్వారా స్పందించాడు. `తుప్పరివాలన్-2`తో తాను దర్శకుడిగా అరంగేట్రం చేయబోతున్నట్టు ప్రకటించాడు. ఆ వివాదం గురించి క్లారిటీ ఇస్తూ ఓ లేఖను తన ట్విటర్ ఖాతాలో పోస్ట్ చేశాడు. `ఎవరి వ్యక్తిగత ప్రతిష్టకో భంగం కలిగించాలనే ఉద్దేశం లేదు. కొంత మంది వ్యక్తుల విషయంలో నిర్మాతలు ఎంత జాగ్రత్తగా ఉండాలో చెప్పాలనేదే నా ఉద్దేశం` అంటూ విశాల్ ట్వీట్ చేశాడు. ప్రొడక్షన్‌లో, షూటింగ్ సమయంలో జరుగుతున్న తప్పులను ప్రశ్నించినందుకే దర్శకుడు అర్ధంతరంగా తప్పుకున్నట్టు విశాల్ వెల్లడించాడు. నిర్మాతగా తానెదుర్కొన్న పరిస్థితిని వేరెవరూ ఎదుర్కోకూడదని ఆకాంక్షించాడు. ఈ సినిమాకు తానే దర్శకత్వం వహించబోతున్నట్టు తెలిపాడు. `తుప్పరివాలన్-2` సినిమాకి అనుకున్న బడ్జెట్ కంటే రూ.5 కోట్లు ఎక్కువ అవసరమైందని, ఆ డబ్బును ఇవ్వడానికి హీరో, నిర్మాత విశాల్ నిరాకరించాడని, అందుకే మధ్యలోనే డైరెక్టర్ మిస్కిన్ సినిమా దర్శకత్వ బాధ్యతల నుంచి తప్పుకున్నట్లు మిస్కిన్ వెల్లడించారు.

Related posts