telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు సినిమా వార్తలు

యాక్షన్, సెంటిమెంట్ రెండు .. ఉండకూడదా అంటున్న విశాల్..

vishal action movie trailer

హీరో విశాల్ ఆ మద్య పందెంకోడి సీక్వెల్ గా పందెం కోడి 2 తో వచ్చి టాలీవుడ్ లో కూడా మంచి సక్సెస్ అందుకున్నాడు. ఈ మూవీలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించింది. డిటెక్టీవ్, అభిమన్యుడు లాంటి సినిమాలతో విశాల్ మంచి విజయాలు అందుకొని తెలుగు, తమిళంలో తనకంటూ ప్రత్యేక క్రేజ్ సంపాదించాడు. అయితే రాజకీయ విషయాల్లో విశాల్ కొంత కాలంగా ఎన్నో కాంట్రవర్సీలు ఎదుర్కొంటున్నారు. తాజాగా విశాల్ నటించిన యాక్షన్ భరిత మూవీ ‘యాక్షన్’. ఈ మూవీలో విశాల్ సరసన తమన్నా నటించింది. సుందర్ సి. దర్శకత్వంలో రూపొందింది. భారీ బడ్జెట్ తో రూపొందిన ఈ సినిమాలో విశాల్ జోడీగా తమన్నా కనిపించనుంది. రాంకీ .. ఐశ్వర్య లక్ష్మి .. యోగిబాబు ముఖ్యమైన పాత్రల్లో కనిపించనున్నారు. ఒక సూపర్ హిట్ టైటిల్ ను మళ్లీ వాడినా ఫ్లాప్ టైటిల్ తో సినిమా వస్తున్నా అందరి చూపు ఆ సినిమా రిజల్ట్ మీదే ఉంటుంది. అయితే యాక్షన్ అనే టైటిల్ తో ఇప్పటికే ఓ మూవీ వచ్చిన విషయం తెలిసిందే.

ఈ టైటిల్ కి ఓ బ్యాడ్ సెంటిమెంట్ ఉంది. గతంలో అల్లరి నరేష్ రాజు సుందరం వైభవ్ లతో ఇదే టైటిల్ తో అనిల్ సుంకర తీసిన సినిమా అట్టర్ ఫ్లాప్ అయింది. మరి ఈ బ్యాడ్ సెంటిమెంట్ విశాల్ సినిమాపై ఎంతటి ప్రభావం చూపిస్తుందో చూడాలి. ఈ సినిమా తెలుగు థియేటర్ హక్కులు 5 కోట్లకి అమ్ముడైనట్టుగా సమాచారం. ఇంతకుముందు తెలుగులో వచ్చిన విశాల్ సినిమాలు ‘అభిమన్యు’ .. ‘డిటెక్టివ్’ బాగా ఆడటం, ఇటీవల అనువాద సినిమాలుగా వచ్చిన ‘విజిల్’ .. ‘ఖైదీ’ చిత్రాలకి ఇక్కడ మంచి ఆదరణ లభించడం వలన ‘యాక్షన్’ సినిమాకి ఈ స్థాయి రేటు పలికిందని చెబుతున్నారు. కాకపోతే ఈ మూవీ ట్రైలర్ చూస్తుంటే భారీ యాక్షన్ మూవీగా కనిపిస్తుంది. మరి విశాల్ ఎంత వరకు విజయం అందుకుంటాడో చూడాలి.

Related posts