telugu navyamedia
సినిమా వార్తలు

విశాల్ “అయోగ్య” ట్రైలర్

Ayogya

పూరీ జ‌గ‌న్నాథ్‌, ఎన్టీఆర్ కాంబినేష‌న్‌లో తెర‌కెక్కిన టెంప‌ర్ చిత్రం హిందీ, త‌మిళ భాష‌ల‌లో రీమేక్ అయిన సంగ‌తి తెలిసిందే. హిందీలో ఇప్ప‌టికే విడుద‌లైన రీమేక్ చిత్రం త‌మిళంలోఅయోగ్య పేరుతో విడుద‌ల‌కి సిద్ధంగా ఉంది. మే 19న చిత్రాన్ని విడుద‌ల చేయనున్నారని సమాచారం. అయితే తాజాగా ఈ చిత్రం నుంచి ట్రైల‌ర్ విడుద‌ల చేశారు. ఈ ట్రైలర్ లోని స‌న్నివేశాలు అచ్చం తెలుగు చిత్రంలోని స‌న్నివేశాలలాగే ఉన్నాయి. హీరో పాత్ర‌కి సంబంధించిన సీన్ల‌తోనే ట్రైల‌ర్ క‌ట్ చేశారు. ఈ ట్రైలర్ కు మంచి స్పందన వ‌స్తుంది. ఏఆర్‌.మురుగదాస్‌ శిష్యుడు వెంకట్‌మోహన్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో విశాల్ పోలీస్ ఆఫీస‌ర్‌గా క‌నిపించ‌నున్నాడు. ఆయ‌న స‌ర‌స‌న రాశీ ఖ‌న్నా క‌థానాయిక‌గా న‌టిస్తుంది. అయోగ్య చిత్రానికి శ్యామ్ సిఎస్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రంలో బాలీవుడ్ భామ స‌న్నీ లియోన్ ఓ ఐటెం సాంగ్ చేసింద‌ని వార్త‌లు వస్తున్నాయి. పార్థిపన్, కే.యస్.రవికుమార్‌లు ముఖ్యపాత్రలు పోషించారు. అయోగ్య థియేట్రికల్ రైట్స్ ను స్క్రీన్ సీన్ సంస్థ దక్కించుకుంది. మీరు కూడా ఈ ట్రైలర్ ను వీక్షించండి.

Related posts