telugu navyamedia
ఆంధ్ర వార్తలు క్రైమ్ వార్తలు

విశాఖ స్టీల్ ఫ్లాంట్ లో మరో అగ్నిప్రమాదం

Mojamjahi Market Fire Accident
విశాఖపట్నం స్టీల్ ఫ్లాంట్ లో మరో అగ్నిప్రమాదం సంభవించింది.  అర్థరాత్రి స్టీల్‌ మెల్టింగ్‌ షాప్‌(ఎస్‌ఎమ్‌ఎస్‌) పిల్టర్‌ ప్లాంట్‌ 2లో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకొంది. దీంతో భారీగా మంటలు చెలరేగి, క్షణాల్లో అక్కడి పంప్ హౌస్ దగ్ధమైంది. సమాచారం అందుకున్న ఫైర్‌ సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. 
కన్వేయర్ పూర్తిగా దగ్ధమవ్వడంతో కోట్లలో ఆస్తినష్టం సంభవించిందని అధికారులు తెలిపారు.నాలుగు రోజుల వ్యవధిలో ఇది రెండో ప్రమాదం. స్టీల్‌ ప్లాంట్‌లో తరచూ ఇలా ప్రమాదాలు జరుగుతుండటంతో సిబ్బంది ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Related posts