telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ రాజకీయ

పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు .. ఆలస్యం కావచ్చు .. : విశాఖ కలెక్టర్ భాస్కర్

visakha collector on counting postal ballet

గతంలో కన్నా విశాఖపట్టణంలో పోస్టల్ బ్యాలెట్ల సంఖ్య రెండున్నర రెట్లు పెరిగాయని జిల్లా కలెక్టర్ భాస్కర్ తెలిపారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, పోస్టల్ బ్యాలెట్లను లెక్కించేందుకు ఎక్కువ సమయం పడుతుందని అన్నారు. పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు పూర్తి కాకముందే ఈవీఎంలు లెక్కించే సౌలభ్యం ఉందని చెప్పారు. అరకు లోక్ సభ నియోజకవర్గం సమాచారం నాలుగు జిల్లాల నుంచి రావాల్సి ఉండటంతో ఇక్కడి ఫలితం వెలువడేందుకు ఎక్కువ సమయం పడుతుందని అన్నారు.

ప్రతి రౌండ్ డేటా సమాచారం విశాఖ ఓట్ల లెక్కింపు కేంద్రంలో ఆర్వోకు చేరుతుందని వివరించారు. విశాఖలో ఈరోజు సాయంత్రం నుంచి 144 సెక్షన్ అమలులో ఉన్నట్టు నగర పోలీస్ కమిషనర్ సీపీ లడ్డా పేర్కొన్నారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, రేపు సాయంత్రం రౌడీషీటర్లకు కౌన్సెలింగ్ నిర్వహిస్తామని అన్నారు.

Related posts