telugu navyamedia
ఆంధ్ర వార్తలు క్రైమ్ వార్తలు ట్రెండింగ్ రాజకీయ వార్తలు

హైటెక్ వ్యభిచారానికి .. విశాఖ అడ్డాగా.. ప్రభుత్వం పట్టించుకోదా… ?

visakha as hightech prostitution hub

నగరాలు అభివృద్ధి పేరుతో చీకటి సామ్రాజ్యాల స్థావరాలుగా తయారవుతున్నాయి. ఒకవైపు అభివృద్ధి, మరోవైపు చట్టవ్యతిరేక వ్యాపారాలు .. ఇది ఎప్పటికైనా భారీ నష్టాన్నే తెచ్చిపెడుతుందని ప్రభుత్వాలు వీటిపై ఉక్కుపాదం మోపాలని ఆయా నగర వాసులు కోరుకోవడం కూడా చూస్తూనే ఉన్నాం. తాజాగా, విశాఖ కూడా హైటెక్ వ్యభిచారానికి అడ్డాగా మారుతుందని అందరికి తెలిసిన విషయం. దీనిపై ప్రభుత్వాలు మాత్రం నిమ్మకు నీరెత్తినట్టుగా ఉందట విచారకరం. విశాఖలో కూడా మెట్రోపాలిటిన్ సిటీ కల్చర్ బాగా విస్తరిస్తోంది. దీనికి తోడు పర్యాటకంగా కూడా విశాఖ అభివృద్ధి చెందుతుండడంతో అసాంఘీక కార్యక్రమాలు కూడా రోజు రోజుకు ఎక్కువ అవుతున్నాయి.

ఇక్కడ విటులను ఆకర్షించేందుకు ఇతర రాష్ట్రాల నుంచే కాకుండా విదేశాల నుంచి కూడా అందమైన అమ్మాయిలను రప్పించి మరీ వ్యభిచారం చేయిస్తున్నారు. ఈ దందా మూడు పువ్వులు ఆరు కాయలుగా ఉండడంతో వీరు విచ్చలవిడిగా విశాఖకు విదేశీ అమ్మాయిల సంస్కృతి అలవాటు చేసేశారు. నగర పరిధి రోజు రోజుకు పెరుగుతుండడంతో పాటు ధనవంతులు, ఇతర వర్గాలను ఈ తరహా ఎంజాయ్‌మెంట్ చేసేందుకు బాగా అలవాటు పడుతుండడంతో వీరి వ్యాపారం బాగా సాగుతోంది. నగరం లోపల, బయట ఉండే గెస్ట్‌హౌస్‌లనే వీరు ఎంచుకుని ఈ దందా చేస్తున్నారు.

తాజాగా అధికారులు జరిపిన దాడులలో ఇతర రాష్ట్రాల నుంచి యువతులను తీసుకు వచ్చి వ్యభిచారం చేయిస్తోన్న వారిని అరెస్టు చేశారు. డాబాగార్డెన్స్‌ వెంకటేశ్వరమెట్ట ఆర్చి సమీప విశాఖ ఇన్‌ లాడ్జీలో వ్యభిచారం జరుగుతుండగా దాడి చేశారు. అలాగే సీతమ్మధారలోని శ్రీసాయి గెస్ట్‌ హౌస్‌లో ఇతర రాష్ట్రాల యువతులతో అసాంఘిక కార్యకలాపాలు నిర్వహిస్తుండడాన్ని గుర్తించి సీజ్‌ చేశారు. కొందరు గెస్ట్‌హౌస్‌ల యజమానులు విదేశాల్లో ఉండి మరి ఇక్కడ మేనేజర్లను పెట్టుకుని మరీ వ్యాపారం చేయిస్తున్నారు. అలాగే పాండురంగాపురం బీచ్‌ గెస్ట్‌ హౌస్‌తో పాటు బీచ్‌ రోడ్డులో ఉన్న కింగ్స్‌ అపార్ట్‌మెంట్‌లో ఎస్‌కేఎంఎల్‌ అతిథి గృహాల పేరిట ఉన్న ఆరు ఫ్లాట్లపై దాడులు చేశారు. వీటిల్లో గుట్టుచప్పుడు కాకుండా వ్యభిచారం నిర్వహిస్తున్నట్టు గుర్తించి వాటిని సీచ్‌ చేశారు. ఇలా చెప్పుకుంటూ పోతే విశాఖలో ఎక్కడ చూసినా జోరుగా వ్యభిచారం జరుగుతోంది.

Related posts