telugu navyamedia
క్రీడలు

వందో టెస్టులో కోహ్లీకి రాహుల్‌ ద్రవిడ్‌ స్పెషల్‌ గిఫ్ట్‌..

మొహాలీ వేదికగా టీమిండియా-శ్రీలంక మధ్య టెస్టు సిరీస్‌లో భాగంగా తొలి మ్యాచ్ జరుగుతోంది. భారత్​ తరఫున వందో టెస్టు ఆడుతున్న 12వ భారతీయుడిగా విరాట్ నిలిచాడు.రెండు టెస్టుల సిరీస్‌లో భాగంగా శుక్రవారం శ్రీలంకతో తొలి మ్యాచ్‌తో 100 టెస్టులు ఆడిన ఆటగాళ్ల జాబితాలో చేరాడు.

ఈ సందర్భంగావంద టెస్టుల విరాట్‌ కోహ్లీకి కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌ ప్రత్యేకంగా తయారు చేసిన స్పెషల్ క్యాప్ అందించారు . ఆ సమయంలో విరాట్ భార్య అనుష్క శర్మ కూడా పక్కనే ఉన్నారు. ఈ సమయంలో కోహ్లి భార్య అనుష్క శర్మ కూడా పక్కనే ఉన్నారు.

WATCH | Virat Kohli Gets His 100th Test Cap From Coach Dravid As Anushka  Sharma Stands

క్యాప్ అందుకున్న తర్వాత కోచ్‌తో పాటు ఆటగాళ్లందరికీ కోహ్లీ ధన్యవాదాలు తెలిపాడు. క్యాప్ తీసుకున్న తర్వాత కోహ్లీ అనుష్కను కౌగిలించుకుని, ముద్దులు పెట్టాడు.

దీనికి సంబంధించిన వీడియోను బీసీసీఐ ట్వీట్ చేసింది. ఈ వీడియోపై అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారువిరాట్ తన టెస్టు కెరీర్‌లో ఇప్పటివరకు 7 డబుల్ సెంచరీలు సాధించాడు. దీంతో పాటు 27 సెంచరీలు, 28 హాఫ్ సెంచరీలు కూడా సాధించాడు.

Watch Video: మైదానంలో ముద్దుల వర్షం కురిపించిన విరుష్క జోడీ.. సెంచరీ టెస్ట్ స్పెషల్ ఇదేనంటోన్న ఫ్యాన్స్.. వైరల్ వీడియో

ఇక కోహ్లీ ఈ మైలురాయి చేరుకోవడంపై ద్రవిడ్‌ మాట్లాడుతూ.. విరాట్‌ ఈ ఘనత సాధించడానికి నిజమైన అర్హుడని, అందుకోసం ఎంతో కష్టపడ్డాడని మెచ్చుకున్నాడు. రాబోయే రోజుల్లో మరిన్ని శిఖరాలు అధిరోహించేందుకు ఈ వందో టెస్టు కోహ్లీకి కొత్త ఆరంభమని పేర్కొన్నాడు. భవిష్యత్‌లో 200 టెస్టులు ఆడాలని ద్రవిడ్‌ ఆశాభావం వ్యక్తం చేశాడు

బీసీసీఐకి థాంక్స్‌

ఇదో ప్రత్యేక సందర్భం..నా కుటుంబ సభ్యులంతా ఇక్కడే ఉన్నారు..తన చిన్ననాటి హీరోల్లో ఒకరైన ద్రవిడ్‌ నుంచి వందో టెస్టు క్యాప్‌ అందుకోవడం చాలా సంతోషంగా ఉందన్నాడు. ఈ సందర్భంగా టీమ్‌ఇండియా తరఫున ఆడేందుకు తనకు అవకాశం ఇచ్చిన బీసీసీఐకి ధన్యవాదాలు చెప్పాలనుకుంటున్నానని తెలిపాడు.

ఎక్కువ మంది టీ20 క్రికెట్‌కు ప్రాధాన్యం ఇస్తున్న వేళ విరాట్‌ వందో టెస్టు ఆడుతుండటం ప్రత్యేకమ‌ని తెలిపారు

Related posts