telugu navyamedia
క్రీడలు సినిమా వార్తలు

వైరల్ వీడియో : సన్నీ లియోన్ తో విరాట్ కోహ్లీ

Viral Video : Virat Kohli with Sunny Leone at The Airport

ప్రపంచవ్యాప్తంగా మంచి క్రేజ్ తెచ్చుకున్న శృంగార భామ సన్నీ లియోన్. బాలీవుడ్ సినిమాల్లో హీరోయిన్ గా సత్తా చాటుతోంది. తాజాగా ఈ హాట్ బ్యూటీ ఇండియన్ క్రికెట్ టీం కెప్టెన్ విరాట్ కోహ్లీతో కలిసి ఉన్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియోకు కొన్ని గంటల్లోనే లక్షల వ్యూస్ లభించాయి. అయితే కొహ్లీ ప్రస్తుతం ఐపీఎల్ మ్యాచ్ కారణంగా బిజీగా ఉన్న విషయం తెలిసిందే. మరి సన్నీతో ఉండడం ఏంటి ? అంటే… ఆదివారం కోహ్లీ హైదరాబాద్ వేదికగా సన్ రైజర్స్ మ్యాచ్ ఆడాడు. అయితే ఈ మ్యాచ్ ప్రారంభం కావడానికి కొద్ది సమయం ముందే ఈ వీడియో వచ్చింది. ఈ వీడియో చూసిన కొహ్లీ అభిమానులు అతడు విరాట్ కోహ్లీ కాదని తేల్చేశారు. అసలు సన్నీ పక్కన ఉన్నదెవరంటే సన్నీలియోన్ మేనేజర్ సన్నీ రజనీ. అతను చూడ్డానికి అచ్చం కోహ్లీలా ఉండడంతో ఈ వీడియో బాగా వైరల్ అయింది. మీరు కూడా ఈ వీడియోపై ఓ లుక్కేయండి.

Related posts