telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు సామాజిక

మహిళతో హైడ్ అండ్ సీక్ ఆడుతున్న ఎలుగుబంటి… వీడియో వైరల్

Bear

మెక్సికోలో ఓ ఎలుగుబంటికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో ట్రెండింగ్ అయ్యింది. మాంటెర్రీలోని చిపింక్ ఎకలాజికల్ పార్క్‌లో ఎలుగుబంట్లు అధికసంఖ్యలో ఉంటాయి. ఈ పార్క్‌కు వెళ్లిన పర్యాటకుల వద్దకు కూడా ఆ ఎలుగు బంట్లు వస్తుంటాయి. శనివారం ఓ పర్యాటకుల గుంపు ఈ పార్క్‌ను సందర్శించగా.. కొన్ని ఎలుగుబంట్లు అటుగా వచ్చాయి. నిశ్శబ్దంగా ఉంటే వెళ్లిపోతాయని.. టూరిస్ట్ గైడ్ సూచించడంతో పర్యాటకులంతా ఉన్న చోటే నిలబడ్డారు. అయితే ఇదే సమయంలో ఓ ఎలుగుబంటి మహిళ వెనుకకు వచ్చి నిలబడింది. అనంతరం రెండు కాళ్లపై నిల్చుని ఆమె జుట్టును సరిచేసింది. అనంతరం సైలెంట్‌గా అక్కడి నుంచి వెళ్లిపోయింది. ఎలుగుబంటి చేసిన పనిని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా.. అది కాస్తా ట్రెండింగ్ అయిపోయింది. ఇదిలా ఉండగా.. పర్యాటకులు ఎలుగుబంట్లకు ఆహారం పెడుతుండటం కారణంగానే అవి అధిక సంఖ్యలో మనుషుల దగ్గరకు వస్తున్నట్టు పార్క్ సిబ్బంది చెబుతోంది. నలుపు రంగు ఎలుగుబంట్లు పెద్ద ప్రమాదకరం కాదని.. మనుషులతో ఆడుకుంటాయని చెబుతున్నారు. అయితే ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందో చెప్పలేమని.. ఎలుగుబంట్లకు ఆహారం పెట్టద్దంటూ పార్క్ సిబ్బంది పర్యాటకులను హెచ్చరిస్తోంది.

 

Related posts