telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

వైరల్ జ్వరాల దృష్ట్యా అన్ని అస్పత్రుల్లో వైద్య కిట్లు: మంత్రి ఈటెల

Etala Rajender

వైరల్ జ్వరాల దృష్ట్యా అన్ని అస్పత్రుల్లో వైద్య కిట్లు అందుబాటులో ఉంచుతున్నామని తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటెల రాజేందర్ అన్నారు. హైదరాబాద్ జూబ్లిహిల్స్ ఆరోగ్యశ్రీ ట్రస్టు కార్యాలయంలో మంత్రి అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. అనంతరంఆయన మాట్లాడుతూ పీహెచ్‌సీ నుంచి పెద్దాసుపత్రుల వరకు అన్నింటిలో మందులు అందుబాటులో ఉంచుతున్నట్టు తెలిపారు. వైదులు ఎవరికీ సెలవులు ఇవ్వడం లేదన్నారు.

వైద్య సేవల కోసం ఔట్‌సోర్సింగ్ వైద్యులను కూడా తీసుకుంటున్నామని తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా ఉండి జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. వర్షాకాలం ప్రారంభం నుంచి వైద్య ఆరోగ్య శాఖ అప్రమత్తమై ఉంది. పంచాయితీరాజ్, జీహెచ్‌ఎంసీ, అర్బన్‌బాడీలతో కో ఆర్డినేషన్ చేసుకున్నాం. బస్తీ దవాఖానాల్లో ఉదయం, సాయంత్రం, ఓపీ సేవలు ఏర్పాటు చేశాం. ఫివర్ ఆస్పత్రిలో కౌంటర్ల సంఖ్య ఆరు నుంచి 24కు పెంచాం. గాంధీ, ఉస్మానియా, ఎంజీఎం, నిలోఫర్ ఆస్పత్రుల్లో సాయంత్రం ఓపీలు పెట్టామని తెలిపారు.

Related posts