telugu navyamedia
సినిమా వార్తలు

“వినయ విధేయ రామ” మొదటివారం కలెక్షన్స్ 

బోయపాటి దర్శకత్వంలో రామ్ చరణ్ నటించిన “వినయ విధేయ రామ” సినిమా ఫ్లాప్ టాక్ తెచ్చుకున్నప్పటికీ కలెక్షన్ల పరంగా మాత్రం మంచి వసూళ్లనే రాబడుతోంది. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా మంచి వసూళ్లను సాధించినా… డిస్ట్రిబ్యూటర్లకు మాత్రం లాభాలు వచ్చేలా కనిపించడం లేదు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా మొదటివారం రూ.50.4 కోట్ల షేర్ ని రాబట్టి డిస్ట్రిబ్యూటర్లకు కాస్త ఊరటనిచ్చింది. ఇప్పట్లో సినిమాలేవీ లేవు కాబట్టి ఈ వీకెండ్ కలెక్షన్లు పుంజుకునే అవకాశం ఉందని భావిస్తున్నారు సినిమా విశ్లేషకులు. 
తెలుగు రాష్ట్రాల్లో ఏరియాల వారీగా మొదటివారం వసూళ్లు :
నైజాం – రూ. 12 కోట్లు 
సీడెడ్ – రూ. 11.2 కోట్లు 
ఉత్తరాంధ్ర – రూ. 6.8 కోట్లు 
గుంటూరు – రూ. 6 కోట్లు
ఈస్ట్ – రూ. 4.6 కోట్లు
వెస్ట్ – రూ. 3.8 కోట్లు
కృష్ణ – రూ. 3.4 కోట్లు 
నెల్లూరు  – రూ. 2.7 కోట్లు   

Related posts