telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ వార్తలు

జో బైడెన్ కే స్పీచ్ రాసిచ్చిన కరీంనగర్ వాసి…

తెలంగాణ కు మరో అరుదైన గౌరవం దక్కింది. అగ్రరాజ్య నూతన అధ్యక్షుడు జో బిడెన్ ప్రమాణ స్వీకార మహోత్సవం లో ప్రజలనుద్దేశించి మాట్లాడే ప్రసంగాన్ని తెలంగాణ రాష్ట్రానికి చెందిన వ్యక్తి రాసి ఇవ్వడం గర్వకారణం. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ప్రసంగాలు రాసిచ్చే యువకుడు ఉమ్మడి కరీంనగర్ జిల్లా వాసి .  జిల్లాలోని హుజురాబాద్ మండలం పోతిరెడ్డిపేట గ్రామానికి చెందిన నారాయణరెడ్డి కుమారుడు వినయ్ రెడ్డి… వైట్ హౌస్ స్పీచ్ రైటింగ్ డైరక్టర్ గా నియమితులవడంతో జిల్లా వాసులు సంతోషంగా ఉన్నారు. వినయ్ రెడ్డి తండ్రి నారాయణ రెడ్డి 1970లో అమెరికాకి వెళ్ళారు.   అక్కడే పుట్టిన వినయ్ రెడ్డి… అమెరికాలో న్యాయవాద డిగ్రీ పూర్తి చేశారు. ఆయనకు కంటెంట్ రైటర్ గా మంచి పేరుంది. మొదట్లో యూఎస్ ఎన్విరాన్ మెంటల్ ప్రొటెక్షన్ ఏజెన్సీ, యూఎస్ డిపార్ట్ మెంట్ ఆఫ్ హెల్త్ అండ్ హ్యుమన్ సర్వీసెస్ సంస్థ తరపున స్పీచ్ రైటర్ గా పని చేశారు.2012  అమెరికా ఎన్నికల సమయంలో వినయ్ రెడ్డి టాలెంట్ తెలుసుకున్న బరాక్ ఒబామా… తన స్పీచ్ రైటర్ గా నియమించుకున్నారు. ఇప్పుడు ఏకంగా జో బైడెన్… అధ్యక్ష భవనమైన వైట్ హౌస్ కి స్పీచ్ రైటింగ్ డైరెక్టర్ గా వినయరెడ్డిని నియమించారు. మొన్నటి అమెరికా ఎన్నికల్లోనూ  బైడన్, కమలా హరిస్ కు స్పీచ్ రైటర్ గా, ట్రాన్స్ లేటర్ గా వినయ్ రెడ్డి పని చేశారు. పోతిరెడ్డిపేటలో ఆస్తులను అమ్ముకోలేదు. ఇప్పటికీ గ్రామంలో మూడెకరాల  వ్యవసాయ భూమి, ఇల్లు వినయ్ రెడ్డి తండ్రి నారాయణ్ రెడ్డి పేరుతోనే  ఉన్నాయి. గ్రామ అభివృద్ధికి ఇప్పటికీ సాయం చేస్తున్నారని పోతిరెడ్డిపేట గ్రామస్థులు చెబుతున్నారు.  వినయ్ రెడ్డి కరీంనగర్ జిల్లా వాసి కావడంతో స్థానికులు, బంధువులు సంతోషంగా ఉన్నారు.

Related posts