telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ వార్తలు

మరోసారి బుద్ది చూపించుకున్న పాక్… హెచ్చరికలు లేకుండా నదిగేట్లు ఎత్తివేత.. మునిగిపోయిన గ్రామాలు..

villages under water with pak irritation

పాక్ ఇక వినదు అనేది మరోసారి స్పష్టం అయ్యింది. మొదటి నుండి సరిహద్దులో కాల్పుల విరమణకు స్వస్తిపలికి దాడులకు పాల్పడుతూనే ఉంది. తాజాగా మరోసారి ఇండియాపై దాడులకు దిగింది పాక్‌. ఈ సారి రూటు మార్చింది. తన దేశంలో ఉన్న సట్లెజ్ నది గేట్లను ఎలాంటి హెచ్చరికలు చేయకుండా ఎత్తేసింది పాపిష్టి పాక్. ఆర్టికల్ 370 రద్దు తరువాత పాక్ నిత్యం ఏదో ఒక రూపంలో ఇండియాకు ఇబ్బందులు తీసుకురావడానికి ప్రయత్నిస్తూనే ఉంది. ఆ ప్రయత్నాల వల్ల ఎలాంటి ఫలితం ఉండదని తెలిసినప్పటికీ.. పాక్ మాత్రం తన బుద్దిని మార్చుకోలేదు. ఎలాంటి ముందస్తు హెచ్చరికలు లేకుండానే తమ పరిధిలో ఉన్న సట్లేజ్‌ నదిపై ప్రాజెక్టు గేట్లను ఎత్తివేసింది. దీంతో భారత్‌లోని పంజాబ్‌కి ఒక్కసారిగా వరద ముంచెత్తింది. పంజాబ్‌లోని సట్లేజ్‌ నదీ పరీవాహక ప్రాంతాల్లోని పలు గ్రామాలు వరద ముప్పుకు గురయ్యాయి. అప్రమత్తమైన పంజాబ్‌ ప్రభుత్వం హై అలర్ట్‌ ప్రకటించింది.

ఎన్డీఆర్ఎఫ్, సైన్యం వెంటనే రంగంలోకి దిగి సహాయక చర్యలను ముమ్మరం చేశాయి. బాధితులకు పునారావస కేంద్రాలను ఏర్పాటు చేసింది పంజాబ్ ప్రభుత్వం. తెండీవాలా గ్రామం వద్ద ఉన్న కరకట్ట తీవ్రంగా దెబ్బతినడంతో అప్రమత్తమైన పంజాబ్‌ ప్రభుత్వం జిల్లా వ్యాప్తంగా హై అలర్ట్‌ ప్రకటించింది. కరకట్ట పునరుద్ధరణకు చర్యలు వేగవంతం చేయాలని అధికారులకు సూచించింది పంజాబ్‌ ప్రభుత్వం. పాకిస్థాన్ ఇలాంటి దురాగతాలకు పాల్పడడం తొలిసారి కాదు. గతంలోనూ అనేక సార్లు ఎలాంటి హెచ్చరికలు లేకుండా సట్లెజ్ ప్రాజెక్టు గేట్లు ఎత్తి దిగువకు నీటిని వదిలిపెట్టింది. పాక్‌ చర్యను పంజాబ్ ప్రభుత్వం తీవ్రంగా ఖండించింది. హెచ్చరికలు లేకుండా పాక్‌ చేసిన ఈ పనిపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది పంజాబ్‌ ప్రభుత్వం.

Related posts