telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

నిరుద్యోగులకు శుభవార్త.. గ్రామ వాలంటీర్ నియామకాలకు నోటిఫికేషన్ విడుదల

ap logo

గ్రామ వాలంటీర్ నియామకాల కోసం ఏపీ ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. ప్రభుత్వ పథకాలను అర్హులకు అందేలా గ్రామ వాలంటీర్ లను నియమించాలని జగన్ సర్కారు నిర్ణయించింది. ఈ మేరకు విధివిధానాలతో రాష్ట్ర సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం ఉత్తర్వులు జారీచేశారు. గ్రామ వలంటీర్ల నియామకాల కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు ప్రకటించారు. గ్రామ వలంటీర్ల నియామకాల్లో స్థానికులకు అధిక ప్రాధాన్యత ఇవ్వడంతో పాటు మహిళలకు 50 శాతం రిజర్వేషన్ కల్పిస్తారు. జూన్ 24 నుంచి జూలై 5 వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు. జూలై 11 నుంచి 25 వరకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు. ఎంపికైన అభ్యర్థులకు ఆగస్టు 1న నియామక పత్రాలను అందజేస్తారు. ఆగస్టు 5 నుంచి 10వ తేదీ వరకు అభ్యర్థులకు శిక్షణ తరగతులు నిర్వహిస్తారు.

వాలంటీర్ నియామకాలకు అర్హతలు:

1. దరఖాస్తుదారుడు అదే పంచాయతీలో నివసిస్తుండాలి
2. ఓసీ కానివాళ్లు తమ కులధ్రువీకరణ పత్రం సమర్పించాలి
3. గిరిజన ప్రాంతాల్లో 10వ తరగతి విద్యార్హత
4. గ్రామీణ ప్రాంతాల్లో ఇంటర్మీడియట్
5. పట్టణ ప్రాంతాల్లో డిగ్రీ అర్హత
6. 2019 జూన్ 30 నాటికి 18-35 ఏళ్లు నిండి ఉండాలి

Related posts