telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్

నీళ్ల కోసం అల్లాడుతున్న .. గ్రామం..

village striving for drinking water

అభివృద్ధి అందరికి అందించేశాము అని చెప్పుకుంటున్న ప్రభుత్వానికి వినపడేట్టుగా.. దానితోపాటుగా ప్రపంచానికి కనిపించేట్టుగా.. మాకు నీళ్లిచ్చే నాథుడే లేడా.. అంటూ .. సంతపేట గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రతీ రోజు ఖాళీ బిందెలతో నీళ్ల కోసమే వెతుకులాడవలసి వస్తుందని గ్రామ మహిళలు వాపోతున్నారు. బైరెడ్డిపల్లి మండల పరిధిలోని నెల్లిపట్ల పంచాయతీ సంతపేట గ్రామస్తులు నీటి దాహంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

మహిళలు మాట్లాడుతూ.. గ్రామంలో ఉన్న కుళాయిలో నీళ్లు సరిగ్గా రావని చెప్పారు. 2, 3 బిందెలు నీళ్లు వచ్చి ఆగిపోతాయని ఆవేదన వ్యక్తం చేశారు. దూరం వెళ్లి.. రైతుల పొలాల్లోని బోరు బావుల్లో నీళ్లు మోసుకొస్తుంటామని వాపోయారు. మా నీటి దాహం తీర్చండి అంటూ.. అధికారులకు, ఎండి కు, పార్టీ శ్రేణులకు ఎన్ని సార్లు విన్నవించుకున్నప్పటికీ, అర్జీలు పెట్టుకున్నప్పటికీ తమ గ్రామాన్ని అధికారులెవ్వరూ పట్టించుకోవడం లేదని ఆవేదన చెందారు. ‘మా దాహం తీర్చే నాథుడే కరువయ్యాడు’ అని గోడు వెళ్లబోసుకున్నారు.

ఇప్పటికైనా అధికారులు స్పందించి తమ నీటి సమస్యను పరిష్కరించాలని గ్రామ మహిళలు కోరారు.

Related posts