telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ వార్తలు విద్యా వార్తలు

గ్రామ సచివాలయ ఉద్యోగాల భర్తీ కి .. నోటిఫికేషన్..15,971 ఖాళీలు..

village Secretariat recruitment through dsc

వివిధ కారణాలతో ఖాళీ అయిన గ్రామ సచివాలయ ఉద్యోగుల భర్తీ చెయ్యాలని ఏపీసీఎం జగన్ అధికారులను ఆదేశించారు. గతంలో గ్రామ సచివాలయ ఉద్యోగాలు భర్తీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం మరోసారి గ్రామ సెక్రటేరియట్ ఉద్యోగాల భర్తీ చెయ్యనుంది .సచివాలయాల్లో ప్రస్తుతం ఖాళీగా ఉన్న 15,971 ఉద్యోగాలు భర్తీ చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు సీఎం వైఎస్ జగన్. ఈ మేరకు సీఎం జగన్ మోహన్ రెడ్డి పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. కొత్తగా మరో 300 గ్రామ సచివాలయాలు నిర్మించాలని అందులో మరో 3,000 మందికి పైగా ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని చెప్పారు.

గ్రామ సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు త్వరగా పూర్తి చేయాలని సీఎం జగన్ ఆదేశించారు. మినీ గోడౌన్ల నిర్మాణంపై దృష్టి సారించాలని అధికారులకు సూచించిన సీఎం జగన్ ఉపాధిహామీ నిధులతో స్కూళ్లకు ప్రహారీ గోడలను నిర్మించాలన్నారు. ఫిబ్రవరి నుంచి ఇంటి దగ్గరకే పెన్షన్లు వస్తాయని చెప్పారు. వాలంటీర్ల ద్వారా లబ్ధిదారులకు అందించాలన్న సీఎం జగన్ పెన్షన్ల కోసం ఎదురుచూపులు లేకుండా చెయ్యాలని ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు. ఇక ఇది ఇలా ఉంటే ఏపీ సర్కార్ జనవరిలో భారీగానే ఉద్యోగాలకు నోటిఫికేషన్ జారీ చేయనుంది. 44,941 పోస్టుల భర్తీకి ఈ దఫా శ్రీకారం చుట్టనున్నట్లు తెలుస్తుంది.

Related posts