telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ రాజకీయ వార్తలు

నెలలోనే గ్రామసచివాలయ నోటిఫికేషన్ ..

ap logo

ఏపీ ప్రస్తుత ప్రభుత్వం తమ ప్రభుత్వ పథకాలను, కార్యక్రమాలను గ్రామ స్థాయిలో ప్రతి వ్యక్తికి చేర్చేందుకు గ్రామ సచివాలయం వ్యవస్థ కీలకంగా మారనుంది. గ్రామల్లో పరిపాలనను మరింత పటిష్టం చేయాలని భావిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం గ్రామ వాలంటీర్ల ఎంపికను పూర్తి చేస్తూ గ్రామ సచివాలయాల ఏర్పాటుకు రంగం సిద్ధం చేసింది. పంచాయతీరాజ్‌, గ్రామీ ణాభివృద్ధి శాఖ ప్రతిపాదనల ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా 13,055 గ్రామ పంచాయతీలు ఉండగా 9,480 గ్రామ సచివాలయాలు ఏర్పాటు చేసే విధంగా అధికారులు ప్రణాళికలు రచించారు.

దీనిలో భాగంగానే ఈనెల 15న నోటిఫికేషన్‌ విడుదల చేయనుంది. గ్రామ సచివాలయ సిబ్బంది నియామకానికి సంబంధించి డిస్ట్రిక్ట్‌ సెలక్షన్‌ కమిటీ (డీఎస్సీ)/ప్రత్యేక కమిటీల ద్వారా జులై 20 నుంచి సెప్టెంబర్‌ 10వ తేదీలోగా నియామక ఉత్తర్వులు ఇవ్వనున్నారు.

Related posts