telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ వార్తలు

లేడీ గబ్బర్ సింగ్ గా .. గ్రామ పంచాయితీ సర్పంచ్..

village sarpanch as lady gabbar singh

అన్యాయం జరిగిన చోట, గొడవలు జరిగిన చోట ప్రత్యక్షం అయి, అక్కడ న్యాయాన్ని నిలబెట్టేందుకు కృషి చేస్తూ, లేడీ గబ్బర్ సింగ్ గా పేరుగాంచింది ఈ మహిళ. ఆమె అభాదేవి, బీహార్ లోని పాట్నా జిల్లాలో ఉన్న అలంపూర్ గోన్ పురా గ్రామ పంచాయితీకి సర్పంచ్. పేరుకు ఆమె సర్పంచ్ మాత్రమే అనుకుంటే షాక్ అవుతారు. తన న్యాయం కూడా అలానే ఉంటుంది. మహిళలపై ఎవరైనా సరే తిరగడబడినా, వాళ్లకు అన్యాయం చేయాలనీ చూసినా వెంటనే అక్కడ ప్రత్యక్షం అవుతుంది. అల్లరి మూకలపై దాడి చేసి మహిళలను రక్షిస్తుంది. మొత్తంగా చెప్పాలి అంటే ఆమె ఒక రౌడీ గబ్బర్ సింగ్. అన్యాయం జరుగుతుంటే చూస్తూ ఊరుకోదు. ఇలా రౌడీ గ్యాంగ్ పై ఓసారి తిరగబడి వారిని కొట్టినందుకు కోపంతో ఆ రౌడీలు ఆమెపై కాల్పులు జరిపారు. చాకచక్యంగా తప్పించుకుంది.

ఆ ఘటనతో భయపడి ఇంట్లో దాక్కోకుండా, భర్త సహాయంతో పిస్తోలు కొని షూటింగ్ నేర్చుకుంది. లైసెన్స్ కు అప్లై చేసింది. ప్రభుత్వం ఆమెకు క్షణాల్లో లైసెన్స్ ఇచ్చింది. ఈ గ్రామ పంచాయితీ పరిధిలో మొత్తం 13 గ్రామాలు ఉన్నాయి. ఈ 13 గ్రామా ల్లో ఎక్కడ ఎలాంటి గొడవ జరిగినా వెంటనే అభాదేవి అక్కడ ప్రత్యక్షం అవుతుంది. ఆమె వస్తుంది అంటే రౌడీ మూకలు పరార్ అవుతారు. అంతేకాదు, ఆ చుట్టుపక్కల పట్టణాల్లో కూడా ఎవరైనా మహిళలు వచ్చి తమను ఈవ్ టీజింగ్ చేస్తున్నారని పోలీసులకు కంప్లైంట్ చేస్తే.. వాళ్ళు అభాదేవిని వెళ్లి కలవమని చెప్తున్నారట. ఆలా చేస్తే న్యాయం జరుగుతుందని చెప్పడం విశేషం. ఇప్పుడు ఆమె పేరు పాట్నా జిల్లాలో మారుమ్రోగిపోతున్నది.

Related posts