telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు రాజకీయ

పండ్లు అమ్ముకుంటున్న .. సర్పంచ్ ..

village leader fruit selling for bread and butter

రాజకీయ నాయకులు అంటే తరాలకు తరబడి ఆస్తులు ఉంటాయి అనుకుంటాం సహజంగా.. కానీ అలా కాక, ఉన్నదానితో అదీ వాళ్ళ జీతంతో మాత్రమే బ్రతికే వాళ్ళు లేకపోలేదు. అలాంటి ఒక గ్రామసర్పంచ్ .. బతుకుదెరువు కోసం పండ్లమ్ముకుంటున్న ఈ ఫొటో ప్రస్తుతం వైరల్ అయ్యింది. కుటుంబ పోషణ కోసం పండ్ల వ్యాపారం చేస్తూ జీవనం కొనసాగిస్తోంది.

నల్లగొండ జిల్లా కట్టంగూర్‌ మండలం బొల్లెపల్లి సర్పంచ్‌గా మంగ ఇటీవల ఎన్నికైంది. సర్పంచ్‌ అయినా ఎప్పటి మాదిరిగానే జిల్లాకేంద్రంలోని క్లాక్‌టవర్‌ సమీపంలో పండ్లు అమ్ముకుంటోంది. కుటుంబ పోషణకు ఇబ్బందిగా ఉండడంతో తిరిగి అదే వ్యాపారాన్ని కొనసాగిస్తున్నానని ఆమె చెప్పడం కొసమెరుపు.

Related posts