telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

భారీ బడ్జెట్ తో .. విక్రమ్ ‘మహావీర్ కర్ణ’…

vikram movie mahavir karna with 300 crores

మగధీర, బాహుబలి వంటి సోషియో ఫాంటసీ చిత్రాల విజయంతో అందరూ అటువంటి కధలలో ఆదరణ ఉన్న పాత్రలను ఎంచుకొని మరి ఆ తరహా చిత్రాలు తెరకెక్కించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ తరహా చిత్రాల విజయాల సగటు కూడా బాగానే ఉండటంతో, ప్రయత్నానికి కూడా వెనుకాడటంలేదు. ఇక అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చాక, రామాయణ మహాభారతాలను వెండితెరపై ఆవిష్కరించడానికి చాలామంది దర్శక నిర్మాతలు ఉత్సాహాన్ని చూపుతున్నారు. ఈ తరహా సినిమాలలో చేయడానికి స్టార్ హీరోలు ముచ్చట పడుతున్నారు. ఈ నేపథ్యంలో తమిళంలో విక్రమ్ కథానాయకుడిగా ‘మహావీర్ కర్ణ’ రూపొందుతోంది. 300 కోట్ల బడ్జెట్ తో నిర్మితమవుతోన్న ఈ సినిమాకి ఆర్.ఎస్. విమల్ దర్శకత్వం వహిస్తున్నాడు.

ఈ చిత్రం టైటిల్ కు తగ్గట్టుగానే, ‘మహాభారతం’లోని కర్ణుడి పాత్రను ప్రధానంగా చేసుకుని ఈ సినిమా సాగుతుంది. ప్రస్తుతం హైదరాబాద్ – రామోజీ ఫిల్మ్ సిటీలో యుద్ధ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. వేలాదిమంది జూనియర్ ఆర్టిస్టులు ఈ షూటింగులో పాల్గొంటున్నారు. మహాభారత యుద్ధం 18 రోజులపాటు కొనసాగింది. ఈ యుద్ధంలో కర్ణుడి విశ్వరూప విన్యాసాన్ని అద్భుతంగా ఆవిష్కరించే ప్రయత్నం చేస్తున్నారు. విక్రమ్ కెరియర్లోనే ఇది చెప్పుకోదగిన చిత్రమవుతుందనేది అభిమానుల నమ్మకం. ఈ చిత్రాలు విజయంతో ఒకటి తెలుస్తుంది కదూ.. తెలిసిన కథనే కొత్తగా చూపిస్తే, ఎన్నిసార్లయినా చూస్తారు.. అని. మంచి సినిమా లాజిక్.

Related posts