telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

నాని “గ్యాంగ్ లీడర్” టీజర్ వచ్చేసింది

Gang-Leader

నాని ప్ర‌స్తుతం విక్ర‌మ్ కుమార్ ద‌ర్శ‌క‌త్వంలో గ్యాంగ్ లీడ‌ర్ చిత్రం చేస్తున్నాడు. నాని 24వ చిత్రంగా రూపొందుతున్న ఈ చిత్రంలో ఆర్ఎక్స్ 100 హీరో కార్తికేయ ప్ర‌తినాయ‌క పాత్ర‌లో క‌నిపించ‌నున్నాడు. ప్రియాంక అరుల్‌మోహ‌న్, ల‌క్ష్మీ , శ‌ర‌ణ్య‌, అనీష్ కురువిళ్ళా, ప్రియ‌ద‌ర్శి, ర‌ఘుబాబు, వెన్నెల కిషోర్, జైజా, స‌త్య త‌దిద‌రులు ముఖ్య పాత్ర‌లు పోషిస్తున్నారు. స్తున్నాడు. 8 ఏళ్ల చిన్న‌ పాప‌.. 17 ఏళ్ల టీనేజ్ అమ్మాయి.. 22 ఏళ్ల క‌త్తి లాంటి అమ్మాయి.. 50 ఏళ్ల అమ్మ వ‌య‌సు ఉన్న మ‌హిళ.. కాటికి కాలు చాపుకున్న బామ్మ‌.. ఈ ఐదుగురు గ్యాంగ్ కు ఓ లీడ‌ర్.. అత‌డే మ‌న గ్యాంగ్ లీడ‌ర్. ఈ ఐదుగురు లైఫ్ సైకిల్ గ్యాంగ్ లీడ‌ర్ క‌థ‌. బామ్మ‌, స్వాతి, ప్రియ‌, వ‌ర‌ల‌క్ష్మి, చిన్ను మ‌ధ్య జ‌రిగే క‌థ ఇది. ట్విట్ట‌ర్లో ఈ టీజర్ విడుద‌ల చేసాడు నాని. మ‌రోసారి విక్ర‌మ్ కే కుమార్ త‌న మార్క్ స్క్రీన్ ప్లేతో సిద్ధ‌మైపోయాడు. టీజర్లో ఐదుగురు ఆడవాళ్లతో నాని ఉన్న తీరు అద్భుతంగా ఉంది. వాళ్లందర్నీ చూస్తుంటే లైఫ్ సైకిల్ చూసినట్లుంది అంటూ కామెడీ డైలాగులు కూడా అదరగొట్టాడు నేచురల్ స్టార్. నా గ్యాంగ్.. విక్రమ్ కథ.. అనిరుధ్ మ్యూజిక్.. మైత్రి డబ్బు.. మన సినిమా.. మీ ఎంటర్ టైన్మెంట్ అంటూ ట్వీట్ చేసాడు నాని. మైత్రి మూవీ మేక‌ర్స్ భారీ బ‌డ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది. సినిమా విడుదల తేదీ త్వరలోనే అనౌన్స్ చేయనున్నారు. ఆగస్ట్ 30 అనుకున్నా కూడా ఆ రోజు సాహో రానుండటంతో ఇప్పుడు నాని కొత్త డేట్ కోసం వేట మొదలు పెట్టారు. మీరు కూడా ఈ టీజర్ ను వీక్షించండి.

Related posts