telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

కర్ణుడి పాత్రలో విక్రమ్ లుక్

vikram

హీరో విక్రమ్ 54వ పుట్టినరోజు (ఏప్రిల్‌ 17) సందర్భంగా ఆయ‌న‌కు అంద‌రూ అభినంద‌న‌లు తెలిపారు. ఆయ‌న టైటిల్ పాత్ర‌లో న‌టిస్తోన్న చిత్రం ‘మహావీర్ కర్ణ’. మలయాళ దర్శకుడు ఆర్‌ఎస్‌ విమల్‌ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. న్యూయార్క్‌కు చెందిన యునైటెడ్‌ ఫిల్మ్‌ కింగ్‌డమ్‌ ఈ చిత్రాన్ని దాదాపు 300 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిస్తోంది. మహాభారతంలోని కర్ణుడి పాత్ర నేపథ్యంలో సాగే ఈ సినిమాలో కర్ణుడిగా నటిస్తున్నారు విక్రమ్‌. ఇందులో సురేష్ గోపి ధుర్యోధ‌నుడి పాత్ర‌లో న‌టిస్తున్నారు. విక్రమ్ బర్త్ డే సందర్భంగా ‘మహావీర్‌ కర్ణ’కు సంబంధించిన ఓ చిన్న వీడియోను విడుదల చేశారు. హిందీ, తమిళ భాషల్లో తెరకెక్కుతున్న ఈ సినిమాను తెలుగులో కూడా విడుదల చేయాలనుకుంటున్నారు. అలాగే అజయ్‌ జ్ఞానముత్తు డైరెక్ట్‌ చేస్తోన్న ‘కోబ్రా’ చిత్రంలో నటిస్తున్నారు విక్రమ్‌. ‘కోబ్రా’ టీమ్‌ కూడా విక్రమ్‌కు బర్త్‌డే శుభాకాంక్షలు తెలుపుతూ ఓ వీడియోను విడుదల చేసింది.

Related posts