telugu navyamedia
telugu cinema news trending

విజయ్ “విజిల్” ట్విట్టర్ టాక్

Bigil

త‌మిళ అగ్ర క‌థానాయ‌కుడు విజ‌య్ హీరోగా “రాజా రాణి” ఫేమ్ అట్లీ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న స్పోర్ట్స్ యాక్ష‌న్ డ్రామా ‘బిగిల్‌’. తెలుగులో బిగిల్ అంటే “విజిల్” అని అర్థం. ఇది వ‌ర‌కు ఈ హిట్ కాంబినేష‌న్‌లో విడుద‌లైన ‘తెరి’ (పోలీస్‌), ‘మెర్స‌ల్’ (అదిరింది) చిత్రాలు బ్లాక్ బ‌స్ట‌ర్ చిత్రాలుగా సెన్సేష‌న్ క్రియేట్ చేశాయి. ఇప్పుడు వీరి క‌ల‌యిక‌లో హ్యాట్రిక్ చిత్రంగా ‘బిగిల్‌’ ప్రేక్ష‌కుల ముందుకు వచ్చింది. నయనతార హీరోయిన్. కతిర్, యోగిబాబు, వివేక్, జాకీష్రాఫ్, ఇందుజా రవిచంద్రన్, ఆనంద్ రాజ్, మోనికా జాన్ తదితరులు నటించారు. ఎ.ఆర్.రెహమాన్ సంగీతం సమకూర్చారు. ఈ సినిమాను ఏజీయ‌స్ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ ప‌తాకంపై క‌ల్పాతి అఘోరామ్ నిర్మిస్తున్నారు. దీపావళి సందర్భంగా శుక్రవారం ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా భారీ అంచనాల నడుమ విడుదలైంది. “బిగిల్” చిత్రాన్ని తెలుగులో “విజిల్” పేరుతో నిర్మాత మహేశ్ కొనేరు విడుదల చేశారు.

‘బిజిల్’ సినిమా ప్రీమియర్ షోలు విదేశాల్లో ఇప్పటికే ప్రారంభమైపోయాయి. తమిళనాడు ప్రభుత్వం కూడా స్పెషల్ షోలకు అనుమతి ఇవ్వడంతో శుక్రవారం తెల్లవారుజాము నుంచే ప్రదర్శనలు మొదలయ్యాయి. ఇప్పటికే సినిమా చూసినవాళ్లు ట్విట్టర్ ద్వారా తమ అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు. అయితే, ట్విట్టర్‌లో మిక్స్‌డ్ టాక్ వినిపిస్తోంది. కొంత మంది సినిమా సూపర్ డూపర్ హిట్ అంటుంటే, కొంత మంది మాత్రం అస్సలు బాగాలేదని, పూర్తిగా నిరూత్సాహపరిచిందని ట్వీట్లు చేస్తున్నారు. అయితే, సినిమా గురించి పూర్తి నెగిటివ్‌గా ట్వీట్లు చేసేది అజిత్ ఫ్యాన్స్ అనే ఆరోపణ కూడా వస్తోంది. పాజిటివ్ టాక్ బట్టి చూస్తే.. ఫస్టాఫ్ అదిరిపోయిందట. రాయప్పన్ క్యారెక్టర్‌ను అట్లీ అద్భుతంగా డిజైన్ చేశారని అంటున్నారు. ఇంటర్వెల్ ముందు వచ్చే ఫైట్ అయితే విజయ్ అభిమానులకు కన్నులపండువేనని టాక్. విజయ్ కెరీర్‌లో రాయప్పన్ పాత్ర ది బెస్ట్ అని చాలా మంది ట్వీట్లు చేస్తున్నారు. నయనతార చాలా క్యూట్‌గా ఉందని అంటున్నారు. ఇక మైఖేల్ పాత్రలో విజయ్ ఎప్పటిలానే చాలా హుషారుగా తన మ్యానరిజంతో అలరించారట. ‘వెర్రెక్కిద్దాం’ సాంగ్ అయితే థియేటర్‌లో ప్రేక్షకులతో ఈలలు వేయించడం ఖాయం అంటున్నారు. రెహమాన్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమాకు మరో బలమట. మరి తెలుగు ప్రేక్షకులను ఈ సినిమా ఎంత మేరకు ఆకట్టుకుంటుందో చూడాలి.

Related posts

ఇద్దరు ఐపీఎస్ లు .. ఇన్నాళ్లు చేసింది ఇదేనా.. ఆర్టీసీ కేసుపై హైకోర్టు ఆగ్రహం..

vimala p

మాది బడుగ గిరిజన తెగ… మా భాష బడుగకు లిపి లేదు.. : సాయి పల్లవి

vimala p

ఇండస్ట్రీకి బాలకృష్ణ కింగ్ కాదు , కేవలం హీరోనే… నాగబాబు సంచలన వ్యాఖ్యలు

vimala p