telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

విజయ్ “బిగిల్” మొదటిరోజు కలెక్షన్స్

Bigil

త‌మిళ అగ్ర క‌థానాయ‌కుడు విజ‌య్ హీరోగా “రాజా రాణి” ఫేమ్ అట్లీ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న స్పోర్ట్స్ యాక్ష‌న్ డ్రామా ‘బిగిల్‌’. తెలుగులో బిగిల్ అంటే “విజిల్” అని అర్థం. ఇది వ‌ర‌కు ఈ హిట్ కాంబినేష‌న్‌లో విడుద‌లైన ‘తెరి’ (పోలీస్‌), ‘మెర్స‌ల్’ (అదిరింది) చిత్రాలు బ్లాక్ బ‌స్ట‌ర్ చిత్రాలుగా సెన్సేష‌న్ క్రియేట్ చేశాయి. ఇప్పుడు వీరి క‌ల‌యిక‌లో హ్యాట్రిక్ చిత్రంగా ‘బిగిల్‌’ ప్రేక్ష‌కుల ముందుకు వచ్చింది. నయనతార హీరోయిన్. కతిర్, యోగిబాబు, వివేక్, జాకీష్రాఫ్, ఇందుజా రవిచంద్రన్, ఆనంద్ రాజ్, మోనికా జాన్ తదితరులు నటించారు. ఎ.ఆర్.రెహమాన్ సంగీతం సమకూర్చారు. ఈ సినిమాను ఏజీయ‌స్ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ ప‌తాకంపై క‌ల్పాతి అఘోరామ్ నిర్మిస్తున్నారు. దీపావళి సందర్భంగా శుక్రవారం ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా భారీ అంచనాల నడుమ విడుదలైంది. “బిగిల్” చిత్రాన్ని తెలుగులో “విజిల్” పేరుతో నిర్మాత మహేశ్ కొనేరు విడుదల చేశారు. ఇక తొలిరోజు ఈ చిత్రం అంతా ఊహించిన‌ట్లుగానే చాలా రికార్డుల‌కు తెర‌తీసింది. ఒక్క చెన్నైలోనే తొలిరోజు గ్రాస్ 2 కోట్లు వసూలు చేసింది. ఈ ఏడాది విడుదలైన విశ్వాసం, పేట సినిమాల కంటే భారీ వసూళ్లు సాధించింది బిగిల్. చెన్నైలోనే కాదు మిగిలిన చోట్ల కూడా ఇప్పుడు బిగిల్ దండయాత్ర సాగుతుంది. తొలిరోజే 50 కోట్ల గ్రాస్ వ‌సూలు చేసింది బిగిల్. త‌మిళ‌నాడులోనే 23 కోట్లు వ‌సూలు చేసింది ఈ చిత్రం. రెండో రోజు కూడా ఎక్క‌డా క‌లెక్ష‌న్లు త‌గ్గిన‌ట్లుగా క‌నిపించ‌డం లేదు. విజ‌య్, అట్లీ కాంబినేష‌న్‌పై ఉన్న క్రేజ్.. సినిమాలో ఉన్న కంటెంట్ బలంగా మారింది. అయితే కామెడీ లేక‌పోవ‌డం.. ఎంట‌ర్‌టైన్మెంట్ మిస్ కావ‌డంతో సినిమా కొన్ని వ‌ర్గాల‌కు న‌చ్చ‌లేదు. అయితే ఈ ప్ర‌భావం దివాళి త‌ర్వాత ప‌డేలా కనిపిస్తుంది. తెలుగులో కూడా బిగిల్ సినిమాకు విజ‌య్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ వ‌చ్చాయి. ఈ చిత్రం ఇక్క‌డ 2.69 కోట్ల షేర్ వ‌సూలు చేసింది. దివాళి సీజ‌న్ అయిపోయే వ‌ర‌కు పెద్దగా సినిమాలు కూడా లేక‌పోవ‌డం బిగిల్‌కు క‌లిసొచ్చే అంశం. తెలుగులో సేఫ్ అవ్వాలంటే 9 కోట్లు రావాలి. వీకెండ్ అయ్యేనాటికి కచ్చితంగా సినిమా మంచి వసూళ్లు తీసుకొస్తుందని నమ్ముతున్నారు నిర్మాతలు. ఖైదీ సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చినా కూడా అన్ని వర్గాలకు అది నచ్చుతుందా అనేది అనుమానమే. ఓవ‌రాల్‌గా బిగిల్ సేఫ్ కావడానికి 140 కోట్లు షేర్ రావాలి.

Related posts