telugu navyamedia
సినిమా వార్తలు

నటికి ఆర్ధిక సాయం… అంతలోనే వేధింపులు

Vijaya-Lakshmi-and-Raviprakash

తెలుగుతో పాటు కన్నడ సినిమాల్లో కూడా నటించిన నటి విజయలక్ష్మీ గతకొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న విషయం తెలిసిందే. హాస్పిటల్ లో ఉన్న విజయలక్ష్మీ తన చికిత్సకు కావాల్సిన ఆర్ధిక సహాయాన్ని సినిమా పెద్దలు చేయాల్సిందిగా కోరారు. ఈ క్రమంలోనే కన్నడ నటుడు రవి ప్రకాష్ ఆమెకు లక్ష రూపాయల ఆర్ధిక సహాయాన్ని చేశారు. అయితే ఇప్పుడు విజయలక్ష్మీ తనకు సహాయం చేసిన రవి ప్రకాష్ పై పోలీసులకు ఫిర్యాదు చేయడం సినిమా ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది.

రవి ప్రకాష్ తనకు సహాయం చేసినప్పటి నుంచి తనను మానసికంగా వేధిస్తున్నాడని, రోజూ తన కోసం ఐసీయూకు రావడం, ఫోన్లో అసభ్యకర మెసేజ్ లు పంపడం లాంటివి చేస్తున్నాడని శనివారం రోజు పుత్తేనహళ్లి పోలీసులకు కంప్లైంట్ చేశారు విజయలక్ష్మి. మరోవైపు విజయలక్ష్మీ ఆరోపణల్లో నిజం లేదని, ఆమెతో తాను మాట్లాడిన రికార్డులన్నీ తన దగ్గర ఉన్నాయని స్పష్టం చేశారు రవి ప్రకాష్. ఇక నటి విజయలక్ష్మి గతంలో హనుమాన్ జంక్షన్‌లో హీరోలు అర్జున్, జగబతిబాబులకు చెల్లెలుగా, హీరో వేణు సరసన ఒక సినిమాలో హీరోయిన్ గా నటించించింది. ఆ తరువాత అవకాశాలు లేక క్యారెక్టర్ ఆర్టిస్టుగా తమిళంలో కొన్ని చిత్రాల్లో నటించింది. ఇప్పుడు ఈ హీరోయిన్ ఆర్ధిక సమస్యలతో కొట్టుమిట్టాడుతోంది. 

Related posts